గిబ్సన్ మాజీ ప్రేయసి నాడియా బాలీవుడ్ ఎంట్రీ
ముంబై: హాలీవుడ్, బాలీవుడ్ బంధం గట్టిపడుతున్నట్లు కనిపిస్తోంది. మెల్ గిబ్సన్ మాజీ ప్రేయసి నాడియా లాన్‌ఫ్రాంకోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఇటాలియన్ - అమెరికన్ గాయని మాత్రమే కాకుండా సంగీత దర్శకురాలు కూడా.
మెలడీగా పేరు పెట్టిన ఆ సినిమాకు సునీల్ బబ్బర్ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో నాడియా నటించడమే కాకుండా ఆ చిత్రంలో ఆమె కూర్చిన సంగీతం కూడా ఉంటుంది. సంగీతకారుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన సునీల్ బబ్బర్ ఆ సినిమాకు సంబంధించిన వివరాలను అందించారు.

"మెలోడీ నా డ్రీమ్ ప్రాజెక్టు. హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ టాలెంట్‌ను ఒకచోటికి తెస్తుంది" అని ఆయన అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి 2105 వరకు మధ్య కాలం ఈ సినిమాకు ఇతివృత్తమని ఆయన అన్నారు. 70 ఏళ్ల కాలాన్ని ఇది పట్టిస్తుందని చెప్పారు.
ఈ సినిమా ఐరోపా నుంచి అమెరికా, అక్కడి నుంచి ఇండియా రాజకీయ సరిహద్దుల గుండా సినిమా నడుస్తుందని చెప్పారు. కర్మ, మ్యూజిక్ పరస్పరం విలీనమవుతాయని, దాన్నే సినిమాలో చూపిస్తానని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











