twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మధుర గాయని సుశీల 75వ జన్మదినం

    By Sindhu
    |

    సంగీతంలోని మాధుర్యాన్ని..ఆ సొగసుని సామాన్యులు కూడా అందుకునేలా చేసిన ఘనత మధురగాయని సుశీలకే దక్కుతుంది. దాదాపు అరవైఏళ్లుగా తన అమృతగానంతో అందర్నీ అలరిస్తున్న సుశీల ఇవాళ 75ఏట అడుగుపెట్టారు. ఆంధ్రా కోకిల సుశీల 1935 నవంబర్‌ 13న విజయనగరంలో జన్మించారు.విజయనగరం,మద్రాసు సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది 12ఏటనే తొలి కచేరీ చేశారు. రేడియోలో కచేరీలు, ఆ తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టడంతో అప్రతిహతంగా ఆమె ప్రస్ధానం కొనసాగింది. నిజంగా ఆమె గానకౌశలం వర్ణనకు అందనిది. హుషారు, విషాదం, భక్తీగీతం, యుగళగీతం ఇలా ఒక్కటేమిటీ పాట ఏదైనా ఆమె పాడితే దానికొక సార్ధకత వస్తుంది. అమె గొంతులోని మాధుర్యం మనసుని పరవశింప చేస్తుంది. తన గొంతుతో నవరసాలు పలికించి తెలుగుపాటనే పునీతం చేశారు.

    ఈ మధ్య అయితే సుశీలమ్మ పాడటం తగ్గించారేమో కానీ 1957 నుంచి మొదలుకుని 90 మధ్యకాలంలో ఆమె పాట వినిపించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.ఆమె గానమాధుర్యంతో పులకించని ప్రేక్షకుడూ లేడు. తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో సుశీల ఐదుసార్లు జాతీయ అవార్డులతోపాటు అన్నేసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో ఆమెను సత్కరించింది. ఇక రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును 2002లో అందుకున్నారు. 60ఏళ్ల సినీ ప్రస్ధానాన్ని అలవోకగా గడిపేసిన ఈ గానకోకిల తన పేరిట ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి , ఏటా తన పుట్టినరోజున సంగీత విద్వాంసులను సన్మానించడం సుశీలమ్మకే చెల్లింది. సో దట్స్ తెలుగు తరపున పి. సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X