twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ మూవీ యూనిట్ డైరెక్టర్ అరెస్ట్

    By Bojja Kumar
    |

    Aamir Khan
    న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం తెరకెక్కుతున్న పొలిటికల్ సెటైర్ మూవీ 'పి.కె'. ఈ చిత్రానికి సంబంధించిన యూనిట్ డైరెక్టర్ ఒకరిని పోలీసులు అరెస్టు చేసారు. అతను సినిమాకు సంబంధించిన ఓ సీన్ చిత్రీకరణ సందర్భంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంతో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

    అయితే అరెస్టు చేయబడ్డ వ్యక్తి ఎవరు? అనేది చెప్పడానికి మాత్రం పోలీసులు నిరాకరించారు. శివుని వేషధారణలో ఉన్న వ్యక్తి ఇద్దరు బుర్ఖా వేసుకున్న మమహిళలను ఎక్కించుకుని రిక్షా తొక్కుతున్నట్లు సీన్ చిత్రీకరించారు. దీనిపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బుధవారం అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

    ఇండియన్ పీనల్ కోడ్(ఐ.పి.సి) 295ఏ, 153ఏ సెక్షన్ల కింద సదరు యూనిట్ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు ఆర్టిస్టులపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మూవీ యూనిట్ సభ్యులు చాందినీ చౌక్ ఏరియాలో బుధవారం ఈ అభ్యంతర కర సీన్ చిత్రీకరించారు.

    మొదట ఇది చూసిన వారు సదరు యాక్టర్లు రామ్ లీలా పార్టీ మెంబర్లు అనుకున్నారు. కానీ కెమెరాలు చూసి ఈ పూర్తి విషయాలు ఆరాతీసి తెలుసుకున్నారు. సినిమాలో ఇది ఎంతో కీలకమైన సన్నివేశమని, మేము అన్ని లీగల్ డాకుమెంట్లతో పాటు, షూటింగ్ పర్మీషన్ కలిగి ఉన్నామని అరెస్టైన వారు వెల్లడించారు. అయితే అమీర్ ఖాన్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

    English summary
    
 A unit director of Aamir Khan's upcoming movie "PK" has been arrested for hurting religious sentiments during the shooting of az scene for the film, police said Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X