»   » థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌పై దాడి.. సల్మాన్, షారుక్ ఫ్యాన్స్ తొక్కేస్తున్నారు.. దారుణంగా కామెంట్స్

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌పై దాడి.. సల్మాన్, షారుక్ ఫ్యాన్స్ తొక్కేస్తున్నారు.. దారుణంగా కామెంట్స్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినిమా పరిశ్రమలో ఓ హీరో మూవీ రిలీజైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హీరోపై మరో హీరో ఫ్యాన్స్ ఆడిపోసుకోవడం కొత్త విషయమేమీ కాదు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌ అభిమానుల తీరును దుయ్యబడుతున్నారు. తమ హీరో సినిమాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఫైర్ కావడం సినీ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

  Thugs of Hindostan Movie Review థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా రివ్యూ
  పెదవి విరిచిన క్రిటిక్స్

  పెదవి విరిచిన క్రిటిక్స్

  థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై సినీ విమర్శకులు పెదవి విరిచారు. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైన నేపథ్యంలో కొన్ని నెగిటివ్ రివ్యూలను సల్మాన్, షారుక్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదంగా మారింది.

  మెరిసేదంతా బంగారం కాదు..

  మెరిసేదంతా బంగారం కాదనే సామెత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌కు చక్కగా సరిపోతుంది. తొలిభాగంలో కొన్ని మంచి అంశాలే ఉన్నాయి. ఇక సినిమా ఫార్మాలాతో సాగింది. స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉంది. డైరెక్షన్ బాగాలేదు. సినిమాకు ఇవే లోపాలుగా మారాయి అని ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

  చూడలేక నిద్రపోయాను..

  అజయ్ దేవగన్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ అకౌంట్‌లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌పై దారుణమైన కామెంట్లు చేశారు. మొదటి భాగం చాలా బోరింగ్‌తో అర్జున్ కపూర్ సినిమా మాదిరిగా ఉంది. సెకండాఫ్ ఎలా ఉందో చెప్పలేను. ఎందుకంటే నేను నిద్రపోయాను. మరో వ్యక్తి ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోండి.

  ఇంటికి పోతానంటూ అలియా ఏడుపు

  థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాపై సోషల్ మీడియాలో దాడి చాలా వాడివేడిగా సాగుతున్నది. ఈ సినిమాను 20 నిమిషాలు చూసిన తర్వాత పరిస్థితి ఇది అంటూ అలియా భట్ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో నేను ఇంటికి పోతాను అంటూ అలియా ఏడవడం గమనార్హం.

  ప్రేక్షకుడి పరిస్థితి ఇలా

  థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడి పరిస్థితి ఇలా ఉంటుంది అని పాత సినిమాలోని అమితాబ్ బచ్చన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను మీరే చూడండి..

  టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని

  మొదటి ఆట తర్వాత వచ్చిన రివ్యూలతో ప్రేక్షకుడి పరిస్థితి ఇలా మారింది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్న వారు తమ టికెట్ డబ్బులను వాపసు ఇవ్వాలని కోరుతున్నారు అని షారుఖ్ బొమ్మను ట్వీట్ చేశారు.

  అతిపెద్ద డిజాస్టర్ ఇదే

  2018లో ఇదే అతిపెద్ద డిజాస్టర్. 200, 300 కోట్లు వసూలు చేయడం చేసినా సరే ఈ సినిమా 50 రూపాయల విలువ కూడా లేదు. 180 కోట్లు వసూలు చేస్తే చాలా గొప్ప. అమీర్ ఖాన్ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్.

  సినిమా చూసిన తర్వాత

  థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటుంది అని ఓ గమ్మత్తైన ట్వీట్ చేశారు.

  ఏది చెప్తే అది చేస్తాను

  థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇలాంటి ఫీలింగ్ కలుగక మానదు. భగవంతుడా నాకు ఇంటికి పోవాలని ఉంది. నీవు ఏది చెప్తే అది చేస్తా. కాని నన్ను ఇంటికి చేర్చే బాధ్యత నీదే.

  ఇక నేరం చేసినట్టే

  థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చాలా దారుణమైన స్టోరి. అమితాబ్ బచ్చన్ తప్ప అందరూ ఇరిటేట్ చేశారు. అమీర్ ఇంత దారుణమైన పాత్రను ఎలా ఒప్పుకొన్నాడు. ఈ సినిమా చూస్తే నేరం చేసినట్టే అని ఓ నెటిజన్ ఆవేదనను వెళ్లగక్కాడు.

  English summary
  Thugs of Hindostan film tells a historical fiction story set in 1795, when the Indian subcontinent was known as Hindustan or Hindostan, where Indian bandits known as Thugs (from the Hindustani word "thug") posed a serious challenge to the expanding British East India Company which had seized control of large parts of India.[5] The film follows a band of Thugs led by Khudabaksh Azaad (Amitabh Bachchan), who poses a grave threat to the British East India Company as he aspires to free the country from the British.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more