‘డైన్ విత్ స్టార్స్’ హంగామా... హైలెట్స్ (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ‘మేముసైతం' ద్వారా హుదూద్ బాధితుల కోసం ఫండ్ రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసేలా డిజైన్ చేసిందే ‘డైన్ విత్ స్టార్స్'. ఈ డైన్ విత్ స్టార్స్ కి వెళ్ళాలంటే ఒక కపుల్ టికెట్ ధర లక్ష రూపాయలు. నవంబర్ 29వ తేదీ రాత్రి బాగా గ్రాండ్ గా జరగింది. ఈ ఈవెంట్ లో దేవీశ్రీ ప్రసాద్ తన బ్యాండ్ తో ఎంటర్టైన్ చేసారు.

విశాఖ హుద్‌హుద్‌ తుపాను బాధితుల సాయం కోసం తెలుగు సినీపరిశ్రమ 'మేముసైతం' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మురళీమోహన్‌, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, బ్రహ్మానందం అల్లుఅర్జున్‌, ప్రభాస్‌, గోపీచంద్‌, నిఖిల్‌, అల్లు అరవింద్‌, , అలీ, రాం, ప్రణీత, కాజల్‌, శాన్వి... తదితరులు పాల్గొన్నారు.

తుపాను తర్వాత విశాఖ పునర్నిర్మాణంలో భాగంగా సినీ పరిశ్రమ ఏకతాటిపై నడిచి 'మేముసైతం' పేరిట ఈనెల 30వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 'డైన్‌ విత్‌ స్టార్స్‌' కార్యక్రమంలో పాల్గొని రూ.లక్ష విరాళం చెల్లించారు. పరిశ్రమలోని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు 'మేము సైతం'లో పాల్గొంటున్నారు.

ఆ ఫొటోలు,హైలెట్స్ మీ కోసం...

బాలయ్య పాట

బాలయ్య పాట

'లెజెండ్‌'లోని 'నీ కంటి చూపుల్లో...' పాటను బాలకృష్ణ ఆలపించారు. హుషారు పాటలకు బాలకృష్ణ వేసిన స్టెప్పులు అతిథులను ఉర్రూతలూగించాయి.

సెల్ఫీలు దిగారు..

సెల్ఫీలు దిగారు..

కార్యక్రమానికి వచ్చిన అతిథులను తారలందరూ దగ్గరకెళ్లి పలకరించి... వాళ్లతో సెల్ఫీలు దిగడం ఆకట్టుకుంది.

కుర్రా,పెద్ద హీరోలు,హీరోయిన్స్

కుర్రా,పెద్ద హీరోలు,హీరోయిన్స్

వేదికపై సీనియర్‌, యువ నాయకానాయికలు ర్యాంప్‌ వాక్‌ అభిమానులను అలరించింది.

కాజల్ ప్రకటించింది

కాజల్ ప్రకటించింది

బాధితుల సహాయార్థం కథానాయిక కాజల్‌ రూ. ఐదు లక్షల చెక్కును చిరంజీవికి వేదికపై అందజేసింది.

దేవి మ్యూజిక్ షో...

దేవి మ్యూజిక్ షో...

దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌షోలో వెంకటేష్‌, అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, నవదీప్‌ తదితర నటులు చిందేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''ఎంతో అందమైన నగరం

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''ఎంతో అందమైన నగరం

విశాఖపట్నం. హుద్‌హుద్‌ తుపాను అందరిలోనూ విషాదాన్ని నింపింది. చాలామంది బాధితులయ్యారు. ప్రతి ఒక్కరికీ మేం బాసటగా ఉంటామని 'మేము సైతం' ఏర్పాటు చేసింది చిత్ర పరిశ్రమ. స్వచ్చందంగా ముందుకొచ్చి తమవంతు సహాయాన్ని అందించిన వారందరికీ చిత్రపరిశ్రమ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన''న్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ

బాలకృష్ణ మాట్లాడుతూ

''విశాఖపట్నం నా రెండో ఇల్లులాంటిది. హుద్‌హుద్‌ తుపానుతో ఆ ప్రాంత వాసులు చాలా నష్టపోయారు. దైవం మానుష్య రూపేణా అన్నట్లుగా వాళ్లను ఆదుకోవడానికి ప్రజలు స్వచ్చంధంగా ముందుకొచ్చారు.

బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...

తెలుగు పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని చాటి చెబుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన కుటుంబంలో ప్రేక్షకులు కూడా భాగం కాబట్టి వాళ్లకు ఎటువంటి అవసరమున్నా సాయం చేసేందుకు ముందుకు రావాలనే లక్ష్యంతోనే 'మేముసైతం' ఏర్పాటు చేశాము''న్నారు.

కకావికలం ...

కకావికలం ...

అక్టోబర్‌లో వచ్చిన ‘హుద్‌ హుద్‌ తుఫాను' ఉత్తరాంధ్రని కకావికలం చేసింది. విశాఖపట్నం కళావిహీనంగా మారిపోయింది. ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 64 మంది ప్రాణాలను కోల్పోయారు. రూ.70 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

టెలిధాన్

టెలిధాన్

ఈ తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ అంతా కలిసి ఈ రోజు( 30న)మారథాన్‌లాంటి ‘టెలిథాన్‌'ను నిర్వహిస్తున్నారు.

టెలిధాన్ లో...

టెలిధాన్ లో...

ఈ కార్యక్రమం ఇంతకు మునుపు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌, స్కిట్‌లు, కబడ్డీ, చిట్‌చాట్‌, అంత్యాక్షరిలాంటివి ఉంటాయి.

చిరు మాట్లాడుతూ..

చిరు మాట్లాడుతూ..

‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లిన ప్రతిసారీ ఆపన్నులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈసారి హుద్‌హుద్‌ తుఫాను బాధితుల కోసం సినీ కళాకారులు పలువురు తమ వంతు సాయం చేశారు. తమిళ హీరోలు చేసిన సాయం కూడా ఎన్నదగినది. ఇప్పుడు పరిశ్రమ మొత్తం ఒకే తాటిపై నిలిచి ‘మేముసైతం' కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులను ఆదుకోనుంది'' అని ప్రముఖ సినీ నటుడు, ఎంపీ చిరంజీవి తెలిపారు.

చిరంజీవి మాట్లాడుతూ...

చిరంజీవి మాట్లాడుతూ...

''ఎక్కడ ఎలాంటి విపత్తులు చోటు చేసుకొన్నా ఆదుకోవడంలో చిత్ర పరిశ్రమ ముందుంటుంది. హుద్‌ హుద్‌ రూపంలో ఈసారి భారీ విపత్తు జరిగింది. చిత్ర పరిశ్రమ కేవలం విరాళాలతోనే సరిపెట్టకుండా... 'మేము సైతం' మీతో ఉన్నామంటూ భరోసా ఇచ్చేందుకు నడుం బిగించింది. 12 గంటలపాటు జరిగే వినోద కార్యక్రమాల్లో ప్రేక్షకుల్నీ భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ చిరంజీవి.

చిరంజీవి కంటిన్యూ చేస్తూ...

చిరంజీవి కంటిన్యూ చేస్తూ...

''అందమైన పచ్చటి విశాఖ కళావిహీనంగా తయారైంది. ఎంత ముందు జాగ్రత్తలు తీసుకొన్నా 64 మంది చనిపోయారు. రూ.70 వేల కోట్లు నష్టం జరిగింది. ఉత్తరాంధ్రని అనుకొనేందుకు ఈ నెల 30న ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 వరకు వినోద కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నాం. తద్వారా వచ్చే నిధుల్ని బాధితుల సహాయార్థ ప్రకటిస్తాం. గతంలో ఎప్పుడూ చేయని కార్యక్రమం ఇది. '' అన్నారు.

చిరంజీవి చెప్తూ...

చిరంజీవి చెప్తూ...

ఎవ్వరూ 500కి తక్కువ కాకుండా విరాళాలు ఇవ్వండి. ప్రతీ పైసా మంచి కార్యక్రమం కోసం వినియోగిస్తాం. కార్యక్రమంలో రకరకాల ఆటలు ఉంటాయి. మెగా డ్రా ద్వారా 104 మందిని ఎంపిక చేస్తాం. వారికి రూ.50 లక్షల విలువైన బహుమానాలు ఇస్తాం అని చెప్పుకొచ్చారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ....

వెంకటేష్‌ మాట్లాడుతూ....

''క్రికెట్‌ విత్‌ స్టార్స్‌ నిర్వహించబోతున్నాం. నేను, నాగార్జున, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అనుష్క, ఛార్మి, అఖిల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మేమంతా కలిసి క్రికెట్‌ ఆడుతున్నాం. ఇందులో మొత్తం ఆరు జట్లుంటాయి. ఒక్కో జట్టులో ఎనిమిదేసి మంది ఉంటారు. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. రూ.3 వేలకు డోనార్‌ పాస్‌లను తీసుకోవచ్చు'' అని హీరో వెంకటేష్‌ తెలిపారు

మురళీమోహన్‌ మాట్లాడుతూ....

మురళీమోహన్‌ మాట్లాడుతూ....

''ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని 12 గంటలపాటు వినోదాన్ని ఆస్వాదించేలా కార్యక్రమాల్ని డిజైన్‌ చేశాము''అన్నారు.

 నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ...

నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ...

‘‘రూ.500 డొనేషన్‌ ఇచ్చినవారు లక్కీ డిప్‌ మెగా డ్రాలో పాల్గొనవచ్చు. ఎంపికైన 104 మందికి బహుమతులు ఉంటాయి. ‘మేముసైతం డాట్‌ కామ్‌' వెబ్‌సైట్‌ ద్వారా రూ.500కి తగ్గకుండా కూడా విరాళాలు చెల్లించవచ్చు. ‘తంబోలా విత్‌ స్టార్స్‌' ప్రోగ్రామ్‌కి పాస్‌లు అందిస్తాం. అన్ని థియేటర్లలోనూ, ఫిలిం చాంబర్‌, ఎఫ్‌ఎన్‌సీసీలోనూ ఈ పాస్‌లు లభ్యమవుతాయి'' అని ఆయన వివరించారు.

టిక్కెట్లు కొన్నారు...

టిక్కెట్లు కొన్నారు...

వేడుకలో అల్లు అరవింద్‌, నాగప్రసాద్‌, అశోక్‌కుమార్‌, శ్రీనివాసరాజు తదితరులు లక్ష రూపాయల టిక్కెట్లు కొన్నారు.

 శెలవు..నో షూటింగ్స్ ..

శెలవు..నో షూటింగ్స్ ..

30వ తేదీన పరిశ్రమకు సెలవు. ఆరోజు షూటింగులు ఉండవు. తెలుగు చలన చిత్రసీమ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

తమిళం నుంచీ..

తమిళం నుంచీ..

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సూర్య, కార్తి, విజయ్‌, విక్రమ్‌ వీళ్లందరినీ ఆహ్వానించాం. అంత్యాక్షరి, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ''అన్నారు.

బెంజ్ కారు గిఫ్ట్

బెంజ్ కారు గిఫ్ట్

మేముసైతం నిర్వహిస్తున్న టెలీథాన్ ప్రోగ్రాంలో లైవ్ తంబోలా ప్రోగ్రాంని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యడానికి ముందుగా మీరు 15,000 రూపాయలు పెట్టి తంబోలా టికెట్ ని కొనుక్కోవాలి. అలా కొనుక్కొని ఈ తంబోలా గేమ్ లో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన వారికి బెంజ్ కార్ ని బహుమతిగా ఇవ్వనున్నారు.

ప్రారంభం..

ప్రారంభం..

హుదు హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్‌ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

వీళ్లంతా..

వీళ్లంతా..

కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, మురళీమోహన్‌, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

దాసరి మాట్లాడుతూ...

దాసరి మాట్లాడుతూ...

ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. హుద్‌హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

దాసరి కంటిన్యూ చేస్తూ...

దాసరి కంటిన్యూ చేస్తూ...

గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు. తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్‌ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X