వెంకీ, నాగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ టీమ్స్ వేలం ద్వారా...

By Bojja Kumar

హైదరాబాద్ : టాలీవుడ్ సినీ పరిశ్రమ కలిసి కట్టుగా ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హుధూద్ తుఫాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో క్రికెట్ మ్యాచ్‌తో పాటు వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్‌లో వేలం ద్వారా ఆయా జట్లకు ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. జట్లలో హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఉండనున్నారు. ఈ నెల 27న జట్ల ఎంపక జరుగుతుంది.

హైదరాబాద్

బిడ్డింగ్ ప్రాసెస్ లో జట్ల ఎంపిక కార్యక్రమం ఈ నెల 27న రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్‌లో కెప్టెన్లు తమ జట్టు సభ్యులను ఎంచుకుంటారు. క్రికెట్ మ్యాచ్ ఆడే స్టార్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

హీరోలు : రవితేజ, అల్లరి నరేష్, నారా రోహిత్, మంచు మనోజ్, గోపీచంద్, కల్యాణ్ రామ్, నాని, నితిన్, నాగ శౌర్య, నిఖిల్, మంచు విష్ణు, తరుణ్, రాజశేఖర్, ఆది, సందీప్ కిషన్, సచిన్ జోషి, సుశాంత్, వరుణ్ సందేశ్, అఖిల్, సాయి ధరమ్ తేజ్, , తారకరత్న, శ్రీకాంత్, ఆదర్శ్, ఖయ్యుం, ప్రిన్స్, సుమంత్, అజయ్, సుధీర్ బాబు తదితరులు.

హీరోయిన్లు : అనుష్క, సమంత, కాజల్, హన్సిక, ప్రణీత, రాకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ప్రియమణి, అర్చన, స్వాతి, రాశి ఖన్నా తదితరులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X