'మేముసైతం' హైలెట్: చిరంజీవి డాన్స్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌ : 'బేగంపేట బుల్లెమ్మో...' అంటూ వేసిన చిరు స్టెప్స్‌ పోగ్రామ్ లో హైలెట్ గా నిలిచాయి. 'మేముసైతం' వేదికపై మెగాస్టార్‌ చిరంజీవి స్టెప్పులతో సందడి చేశారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చిత్రంలోని బేగంపేట బుల్లెమ్మో గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ ఆలపించగా చిరంజీవి నృత్యం చేశారు. ఆయనతో పాటు వెంకటేష్‌, అల్లుఅర్జున్‌, శ్రీకాంత్‌, సాయిధరమ్‌తేజ్‌లు కూడా చేరడంతో అభిమానుల కేరింతలతో 'మేముసైతం' కార్యక్రమం మార్మోగిపోయింది. ఆ స్టెప్స్ ని మీరూ ఈ క్రింద చూడవచ్చు...

మేముసైతం కార్యక్రమం సామాన్య అంశం కాదని యజ్ఞమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కష్టకాలంలోనూ తెలుగు చిత్రపరిశ్రమ మేముసైతం అంటూ ముందుకు వస్తామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలుగుప్రజలను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందువుంటుదన్నారు. విశాఖకు తిరిగి పూర్వవైభవం తీసుకవచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అందరూ కలిసి మేము సైతం అంటూ గానాలాపన చేశారు.

Memu Saitham:Dance performance by Chiru - Highlight of the night session

ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆపద కలిగినా, ఆదుకోవడానికి ముందుకొచ్చిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ సారి ఉత్తరాంధ్ర హుద్‌హుద్‌ పెను తుపాను బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ‘మేము సైతం' అంటూ కదిలింది. చిత్రసీమకు చెందిన పలు శాఖలవారు ఒక్కటై చేసిన ‘మేము సైతం' కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల వరకు ఆద్యంతం వినోదభరితంగా, కన్నులపండువగా జరిగింది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగగా, ఆ తర్వాత నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో కబడ్డీ, క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఎనిమిదేళ్ల క్రితం అత్యంత వైభవంగా జరిగిన తెలుగు చిత్రసీమ వజ్రోత్సవాల అనంతరం పరిశ్రమలోని అత్యధికులు పాల్గొన్న కార్యక్రమం ‘మేము సైతం' అని చెప్పాలి.

ఈ కార్యక్రమం ద్వారా హుద్‌హుద్‌ బాధితులకు చిత్రసీమ ఎంత అందజేస్తుందన్నది ముఖ్యం కాదనీ, తాము అందించిన స్ఫూర్తిని మాత్రమే చూడాలని దాసరి నారాయణరావు తెలిపారు. చిత్రసీమ యావత్తూ ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని మోహన్‌బాబు చెప్పగా, తెలుగువాళ్లకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, నేనున్నానంటూ చిత్రసీమ భరోసానిస్తూ వచ్చిందని బాలకృష్ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X