మహేష్ అదరకొట్టాడు : సమంత-మహేష్,త్రివిక్రమ్ ఇంటర్వూ పూర్తిగా(వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: తుపాను బాధితుల సహాయం కోసం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం... కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా సినీనటి సమంతా మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను ఇంటర్వ్యూ చేశారు. సమంతా మహేష్‌బాబును అడిగిన ప్రశ్నలకు ఆహూతులు నవ్వుకున్నారు. సమంత,మహేష్ కాంబినేషన్ లో గతంలో దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

హుద్‌హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం సినీతారలు చేపట్టిన మేముసైతం కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా కొనసాగుతోంది. కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నటీనటులంతా వారి వారి శైలిలో వినోద కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు.

కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మైదానంలో కబడ్డీ, క్రికెట్‌ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అభిమాన నటులను చూసేందుకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మైదానానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.

Memu Saitham: Mahesh intervied by Samantha

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు బాబా సెహగల్‌ తన దైన పాటలతో హుషారెత్తించారు. బాబా సెహగల్‌ పాటలకు నిర్మాతలు సురేష్‌బాబు, రామానాయుడు, అల్లు అరవింద్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకులు రాఘవేంద్రరావు, పలువురు నటులు స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు.

ఇక హుదు హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్‌ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, మురళీమోహన్‌, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇక ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ... గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు.

తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్‌ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... తుపాను బాధితుల సహాయం కోసం కళాకారులు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ ద్వారా అందరం కలిసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల బాధితుల కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X