»   » ఎంజీబీఎస్ బస్టాండ్: మూటలు మోసిన మంచు మనోజ్ (ఫోటోస్)

ఎంజీబీఎస్ బస్టాండ్: మూటలు మోసిన మంచు మనోజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ఉన్నట్టుండి హైదరాబాద్ నడిఒడ్డునగల ఎంజీబీఎస్ బస్టాండ్ లో దర్శనమిచ్చారు. పోర్టర్ అవతారం ఎత్తి మూటలు మోస్తున్న ఆయన్ను చూసి ప్రయాణీకులంతా ఆశ్చర్యపోయారు. తొలుత ఇదేదో సినిమా షూటింగ్ అనుకున్నారు..... కానీ ఇది ఓ సేవా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం అని తెలిసి అంతా ప్రశంసించారు.

మనోజ్ సోదరి మంచు లక్ష్మి 'మేమే సైతం' పేరుతో ఓ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినీ స్టార్స్ చేత వివిధ పనులు చేయించి పండ్స్ కలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బును తీవ్రమైన కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు సహాయం చేస్తున్నారు.

అందులో భాగంగానే మంచు మనోజ్ ఎంజీబీఎస్ బస్టాండులో పోర్టర్‌గా మారాడు. మూటలు మోసాడు. అక్కయ్య మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం ద్వారా ఒక ఫ్యామిలీకి సహాయం చేసేందుకు పోర్టర్ అవతారం ఎత్తి మూటలు మోయడం, ఫండ్ రైజ్ చేయడం...ఫీలింగ్ గ్రేట్ అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.

మంచు లక్ష్మి మరో సోదరుడు మంచు విష్ణు కూడా ఒక్క రోజు పానీపూరి అమ్మి త‌న వంతుగా 75,000 రూపాయ‌లు సంపాదించాడు. వాటిని జ‌ర్న‌లిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఇచ్చిన సంగతి తెలిసిందే.

స్లైడ్ షోలో మంచు మనోజ్ ఎంజీబీఎస్ ఫోటోస్...

మూటలు మోస్తూ..

మూటలు మోస్తూ..

ఎంజీబీఎస్ బస్టాండులో మూటలు మోస్తున్న మంచు మనోజ్..

సామాన్లు ఎక్కిస్తూ..

సామాన్లు ఎక్కిస్తూ..

ఆర్టీసీ బస్సుపైకి సామాన్లు ఎక్కిస్తున్న మంచు మనోజ్.

మంచు మనోజ్

మంచు మనోజ్

బస్టాండులో పోర్టర్ కార్మికులు, అభిమానులు, ప్రయాణికుల మధ్య మంచు మనోజ్.

ఒక మంచి పని కోసం.

ఒక మంచి పని కోసం.

ఒక మంచి పని కోసమే తాను పోర్టర్ అవతారం ఎత్తానని చెబుతున్న మంచు మనోజ్.

 కార్మికుల సమస్యలు

కార్మికుల సమస్యలు

పోర్టర్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మనోజ్.

English summary
"LakshmiManchu ‪#‎Memusaitham‬ worked as a porter and raised money for a needy family🙏 Feeling gr8🙏 thank u" Manchu Manoj said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu