twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హెవీ ఫీవర్ తో ఎన్టీఆర్...సిగ్గుగా అనిపించి(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ రెండ్రోజుల నుంచీ జ్వరంతో బాధపడుతున్నా ఆటలోకి దిగడం విశేషం. ఎన్టీఆర్ మాట్లాడుతూ... "నాకు రెండు రోజులుగా ఒంట్లో బాగాలేదు. నేను మ్యాచ్ కు రాలేను అనుకున్నాను. అయితే ఉదయం నుంచి చేస్తున్నాలు చూసి నాకు సిగ్గుగా అనిపించింది. అందుకే ఉడతా భక్తిగా చేద్దామనిపించింది. నేను ఏదైనా సహాయం చేయగలిగితే అది చేస్తాను. ", అంటున్నారు ఎన్టీఆర్. ఆయన మాటలు స్వయంగా వినండి...

    ఇక హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విపత్తులు సంభవించిన ప్రతిసారి బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ... ముందుకొచ్చే చిత్ర పరిశ్రమ ఈసారి కూడా తన బాధ్యతను నెరవేర్చింది. నాడు ఎన్టీఆర్‌ నుంచి మొదలైన సేవా సంస్కృతిని తాము కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

    Memu Saitham: NTR Speech At Memu Saitham Event

    లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి నిర్మాత వరకు అందరూ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు. నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలంతా ఒకే చోట చేరి ఉల్లాసంగా ప్రదర్శనలిచ్చారు. ఓ వైపు అన్నపూర్ణ స్టూడియోలో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు విరాళాలు వెల్లువెత్తాయి. చెన్నై, ముంబయి నుంచి కూడా కళాకారులు తరలివచ్చారు.

    మేము సైతం.. అంటూ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాసరి నారాయణరావు, మురళీమోహన్‌, బాలకృష్ణ, మోహన్‌బాబు, అల్లు అరవింద్‌, రాఘవేంద్రరావు, సురేష్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌ తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

    మేము సైతం కార్యక్రమంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ తొలిసారిగా వేదికపై పాటలు పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కామెడీ కింగ్‌ బ్రహ్మానందం తనదైన శైలిలో హాస్యపు జల్లులు కురిపించారు.

    దేక్‌... దేక్‌.. గబ్బర్‌సింగ్‌ అంటూ ప్రముఖ గాయకుడు బాబా సెహగల్‌ పాడిన పాటకు కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, దర్శక నిర్మాతలు స్టెప్పులు వేశారు. సెహగల్‌ పాటలు ఆహూతులను ఉర్రూతలూగించాయి. సినీనటి సమంత, మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లను ఇంటర్వూ చేసి అందరినీ నవ్వించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కళాకారుల కబడ్డీ పోటీ ఆకట్టుకుంది.

    English summary
    "I'm not feeling well from last two days. Thought that I would not attend the match, but after looking at the efforts being made by various celebs from today morning at Memu Saitham, I felt shame and came to play circket now. Let me do whatever little help I can", said Junior NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X