మేము సైతం: విబేధాల్లేవని దాసరి, బిఎండబ్ల్యూ కారు...
హైదరాబాద్: ఈ నెల 30న ‘మేము సైతం' పేరుతో హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం అందించే ఉద్దేశ్యంతో టాలీవుడ్ పరిశ్రమ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన పలు ‘మేము సైతం' ప్రెస్ మీట్లలో దాసరి పాల్గొనలేదని, మరికొన్ని ప్రెస్ మీట్లలో ఇంకెవరో పాల్గొనలదని......పరిశ్రమలోని పెద్దల మధ్య విబేధాల వల్లనే ఇలా జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో దాసరి నారాయణరావు వివరణ ఇచ్చారు.
‘మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, ఎవరి వీలును బట్టి వాళ్లు పాల్గొంటారు. యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక్కతాటిపై నిలబడి చేస్తున్న బృహత్తర కార్యక్రమం ఇది. ఇటువంటి సందర్భంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నివిభేధాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు వస్తుంటాం. రాయలసీమ కరువుపై చేసిన ప్రోగ్రామ్ నుండి ఇప్పటి మేమ సైతం వరకు ఒకే తాటిపై జరిగాయి. మేము లేక పోయినా మా తర్వాతి జనరేషన్ ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేసారు. తరాలు మారుతుంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు మారుతుంటారు. కానీ సినిమాకి, ప్రేక్షకుడికి మధ్య ఉండే సంబంధం శాశ్వతమైనది' అన్నారు దాసరి నారాయణ రావు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు....

నటీనటులంతా తమ వంతుగా...
‘మేము సైతం'లో నటీనటులు అంతా తమ వంతుగా ఏదో ఒక ఫ్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారు. గేమ్స్ షోలు, స్కిట్ షోలు ఇలా రకరకాలుగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వివిధ రకాలుగా...
మంచు విష్ణు, మంచు మనోజ్ రెండు టీంలుగా విడిపోయి కబడ్డీ ఆడబోతున్నారు. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క అంతా ఒక ఫ్రోగ్రామ్, పవన్, త్రివిక్రమ్, మహేష్ మరో ఫ్రోగ్రాం ఇలా స్టార్స్ అంతా రకరకాల కార్యక్రమాలు చేస్తారు.

డిన్నర్ విత్ స్టార్స్
ఈ నెల 29న సాయంత్రం డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమం ఉంది. ఇందులో పాల్గొనాలనుకునే వారు. రూ. లక్ష పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంది.

గ్రేట్ తంబోలా, బిఎండబ్ల్యూ కార్ బహుమతి
గ్రేట్ తంబోలా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు రూ. 15 వేల విలువ చేసే టికెట్ కొనాల్సి ఉంటుంది. మొదటి విజేతకు బిఎండబ్ల్యూ కారు, రెండవ బహుమతి పదిలక్షల విలువైన బంగారం, మూడవ బహుమతిగా లక్ష రూపాయల ఫ్రైజ్ మనీ ఉంటాయి.


Click it and Unblock the Notifications











