»   » వారికి బాధ్యత లేదా?: తెలుగు హీరోలపై మంచు లక్ష్మి ఫైర్!

వారికి బాధ్యత లేదా?: తెలుగు హీరోలపై మంచు లక్ష్మి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తెలుగు హీరోలపై ఫైర్ అయ్యారు. ఒక మంచి పని చేద్దామనే ఉద్దేశ్యంతో మేము చేస్తున్న 'మేము సైతం'. ఈ కార్యక్రమంలో పాల్గొనమని మన తెలుగు హీరో హీరోయిన్లందరినీ అడిగాను. కానీ కొందరు హీరోలు మాత్రమే స్పందించారు. చాలా మంది స్టార్ హీరోలు స్పందించడం లేదు. ఈ విషయంలో బాలీవుడ్‌ హీరోలు బెటర్‌’ అని వ్యాఖ్యానించారు.

సమాజంలో అనారోగ్య, ఆర్ధిక బాధలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ వంతు బాధ్యతగా శ్రమిస్తూ వెండితెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా తమ సత్తా చాటుకోవడానికి మేము సైతం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

వరుస యాక్సిడెంట్స్ తో నడవలేని పరిస్థితిలో ఉన్న హోటల్ సర్వర్ ని ఆదుకోవడానికి మోహన్ బాబు సర్వర్ గా మారారు. చనిపోయిన కూలి కుటుంబాన్ని ఆదుకోవడానికి రానా కూలీగా మారారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ ఆటోడ్రైవర్ కోసం అఖిల్ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయల వ్యాపారి అయ్యింది. నాని మెకానిక్ గా, శ్రేయ సేల్స్ గర్ల్ గా మారారు. ఇంకా రవితేజ, సమంత, అనుష్క, కాజల్, తమన్నా, రెజీనా, లావణ్య త్రిపాఠి ఇలా ఎందరో స్టార్స్ మహోన్నత ఆశయంతో కోట్లాది అభిమానులకు స్ఫూర్తిగా నిలవనున్నారు అని ఆమె తెలిపారు. 

Also Read: ఇడ్లీలు అమ్మిన మోహన్ బాబు, గతంలో కూడా (ఫొటోలు)

ఆమె హోస్ట్‌గా రూపుదిద్దుకుంటున్న 'మేముసైతం' టెలివిజన్‌ షో గురించి తెలియజేయడానికి బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. నటులు సుశాంత్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో పాటుగా నిర్మాత జెమినీ కిరణ్‌, జెమినీటీవీ బిజినెస్‌ హెడ్‌ సుబ్రహ్మణ్యం, నార్త్‌ రీజియన్‌ హెడ్‌ కాశీ తదితరులు హాజరయ్యారు.

Also Read: అదేం పాత్ర?... మంచు లక్ష్మికి మోహన్ బాబు చివాట్లు!

ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ''మేము సైతం కాన్సెప్ట్‌ రెండేళ్ల క్రితం నా మదిలో వచ్చిన ఆలోచన. అయితే దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియలేదు. సరిగ్గా ఆరు నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తనయురాలు శ్రుతి షిండే ఈ కాన్సెప్ట్‌ గురించి నా దగ్గర డిస్కస్‌ చేయడంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను. హిందీలో 'మిషన్‌ సప్నే' పేరిట ఈ కార్యక్రమం ఆమె రూపొందిస్తున్నారు.

ఇకనైనా హీరోలు స్పందించాలి

ఇకనైనా హీరోలు స్పందించాలి


ఏప్రిల్‌ 2 నుంచి ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షో చూసిన తరువాత అయినా హీరోలు స్పందిస్తారని ఆశిస్తున్నాను లక్ష్మి.

26 ఎపిసోడ్స్

26 ఎపిసోడ్స్


మొత్తం 26 భాగాలుగా ఈ షో చేయనున్నాం. నీడీ పీపుల్‌ కోసం స్టార్స్‌ రియల్‌గా కష్టపడటమే ఈ షో'' అని అన్నారు లక్ష్మి

రకుల్

రకుల్


రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ‘‘ క్యాన్సర్‌ బాధిత చిన్నారి కోసం కూరగాయలు అమ్మాను'' అని అన్నారు.

హిందీలో..

హిందీలో..


కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తనయురాలు శ్రుతి షిండే ఈ కాన్సెప్ట్‌ గురించి నా దగ్గర డిస్కస్‌ చేయడంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను. హిందీలో ‘మిషన్‌ సప్నే' పేరిట ఈ కార్యక్రమం ఆమె రూపొందిస్తున్నారు అన్నారు లక్ష్మి.

English summary
Lakshmitho Memu Saitam Press Meet held at Hyderabad. Lakshmi Manchu, Rakul Preet Singh, Sushanth, Gemini Kiran graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu