చొక్కా విప్పమన్నారు.. సిగ్గేసింది అంటున్న హీరో
తెరమీద అయితే చొక్కా విప్పినా సమస్య అనిపించదు కానీ..చుట్టూ జనం ఉంటే మాత్రం ఇబ్బందే అంటున్నాడు జాన్ అబ్రహం. ఆయనకు తాజాగా ఆ రకమైన అనుభవం ఎదురైంది. సినిమాల్లో అర్ధనగ్న ప్రదర్శనలకు పెట్టింది పేరైన ఈ బాలీవుడ్ నటుడు ఈ మధ్య తనకు ఓసారి సిగ్గేసిందని చెబుతున్నాడు. ఎప్పుడని అడిగితే...ఇటీవల తాను త్వరలో విడుదల కాబోయే తన చిత్రం జూఠా హీ సహీ సీడీని ఆవిష్కరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆ కార్యక్రమానికి హాజరైన కొందరు అబ్బాయిలు తనను చొక్కా విప్పాల్సిందిగా పట్టుబట్టారని చెప్పాడు. ఇటువంటి అనుభవాలు గతంలో ఎన్నోసార్లు ఎదురైనా తానంతగా సిగ్గుపడలేదని, అయితే ఈసారి అబ్బాయిలు చొక్కా విప్పుమనడంతో సిగ్గేసిందన్నాడు. ఇంతకీ విప్పారా? లేదా అని అడిగితే...చెప్పానుగా సిగ్గేసిందని..అంటూ నవ్వేశాడు. ఇక జూఠా హీ సహీ చిత్రం బ్రిటన్ చిత్రం నాటింగ్ హిల్ కి కాపీ అని అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











