»   » వాళ్లు ఎప్పుడూ సెక్స్ గురించే, మేము అలా కాదు : ఇలియానా సంచలనం!

వాళ్లు ఎప్పుడూ సెక్స్ గురించే, మేము అలా కాదు : ఇలియానా సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లవ్, సెక్స్, డేటింగ్, రిలేషన్ షిప్స్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడే హీరోయిన్ ఇలియా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా అబ్బాయిల గురించి, సెక్స్ గురించి ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది

అబ్బాయిలకు ఎప్పుడూ సెక్స్ యావ తప్ప మరొకటి ఉండదని, ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వారు సెక్స్ గురించి ఆలోచిస్తారు.... కానీ అమ్మాయిలు అలా కాదు, వారికి సెక్స్ తో పాటు చాలా ఆలోచనలు ఉంటాయని ఆమె తెలిపారు.

అమ్మాయిల ఆలోచనలు ఇలా

అమ్మాయిల ఆలోచనలు ఇలా

అమ్మాయి ఫుడ్, సెక్స్, షూస్, దుస్తులు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దీంతో పాటు నేను జిమ్ కు వెళ్లాల్సిన అవసర ఉందా? నా ఫొటోను అతను ఎందుకు లైక్ చేయడం లేదు? పెదవులకు ఇంజెక్షన్ చేయించుకోవాలా? నా ఇంటిపేరు నాకు ఇప్పటికీ ఇలాగే ఉంటుందా? నా కనుబొమ్మలు బాగున్నాయా? బాగాలేని ఈ గోళ్లను వదిలించుకోవడం ఎలా? సమయం కంటే ముందుగానే వైన్ తాగుతున్నానా? ఇలా అమ్మాయిల ఆలోచనలు సాగుతాయని, అమ్మాయిలు అందుకే చాలా క్రేజీగా ఉంటారని ఇలియానా చెప్పుకొచ్చింది.

ఇప్పుడెందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో?

ఇప్పుడెందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో?

ఇలియానా కొన్ని రోజులుగా అసలు వార్తల్లోనే లేదు. సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. వార్తల్లో వ్యక్తిగా మారడానికే ఆమె ఇలాంటి పోస్టులు పెడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.

అప్పట్లో బీచ్ లో సెక్స్ కావాలంటూ..

అప్పట్లో బీచ్ లో సెక్స్ కావాలంటూ..

గతంలో ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ, రిలేషన్ షిప్స్‌పై తన అభిప్రాయం, లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది. ప్రియుడితో మీరు కోరుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ.... ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

అలా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం

అలా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం

ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఎంజాయ్ చేయడం కోసం కొంత మంది చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. హీరోయిన్ ఇలియానాకు కూడా ఇలా ఎంజాయ్ చేసే అలవాటు ఉందట. ఈ విషయాన్ని ఆమె కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒంటరిగా ఇంట్లో ఉండటం. మిడ్ నైట్ బట్టలిప్పేసి కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుని టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ నచ్చిన ఫ్రోగ్రామ్స్ చూడటం అంటే చాలా ఇష్టం.' అంటూ ట్వీట్ చేసింది.

English summary
"Men Think about sex onece every 5 seconds, Women think food, sex, shoes, cloths." Actress Ileana said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu