twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష డేట్స్ దొరక్కే..మెంటల్ కృష్ణ

    By Staff
    |

    Mental Krishna
    త్రిషను మావాళ్లు అప్రోచ్‌ అయ్యారు. కానీ ఆమె డేట్స్‌ అందుబాటులో లేవన్నారు. సింధూ తులానికి నా ఆఫీసులోనే లైన్‌ చెప్పా. 'బాగుందండి' అని వెళ్లింది కానీ మళ్లీ సమాధానం లేదు. ఆ తర్వాత సింధూ మీనన్ ను సంప్రదించాం. ఆమె అప్పటికే శంకర్‌ తీసే సినిమాలో నటిస్తున్నానీ, అది పూర్తయ్యేదాకా కాల్షీట్లు ఇవ్వలేననీ తెలిపింది. ఆ తర్వాత సత్యకృష్ణను తీసుకున్నా అన్నారు.రచయిత,దర్శకుడు పోసాని కృష్ణమురళి తన దర్శకత్వంలో రాబోతున్న మెంటల్ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా సత్య కృష్ణన్ ని తీసుకోవటంపై పై విధంగా పోసాని స్పందించారు.

    అయినా మా హీరోయిన్ వేషానికి అందగత్తె, స్టైల్‌గా ఉండే వాళ్ళు అవసరం లేదు. సినిమాలో బాగా సఫర్‌ అయ్యే, చివరలో తిరగబడే పాత్ర. సత్యకృష్ణ ఫేస్‌ చూసి, పెళ్లాం పాత్రకి సూట్‌ అవుతుందని తీసుకున్నా. ఆమె చేత బాగా చేయించుకుంటాననే నమ్మకం ఉంది'' అని ఆయనకు చెప్పా.కన్విన్స్‌ అయ్యారు.దానికి తగ్గట్లే ప్రతి సీనూ ముందుగా రిహార్సల్‌ చేయించి, తర్వాత ఆమెను కెమెరా ముందుకు తెచ్చేవాణ్ణి.పోసాని తొలిసారి హీరోగా చేస్తూ రూపొందించిన చిత్రం 'మెంటల్‌ కృష్ణ'. ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X