తన మెంటల్ కృష్ణ సినిమాలో దళితనాయుకుడు మందాకృష్ణపై ఏ విధమైన సెటైర్స్ లేవని,అలాగే ఆయనకు వ్యతిరేకంగా సీన్స్ లేవని పోసాని కృష్ణ మురళి తెలిపారు. టైటిల్ కి మందకృష్ణకి ఏమైనా సంబంధం ఉందా అని మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోసాని ఇలా చెప్పుకొచ్చారు. అంతేగాక మందాకృష్ణ దళితుల సమస్యలు,ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న వ్యక్తి అని ఆయనంటే తనకు పూర్తి గౌరవం అని చెప్పుకొచ్చారు. ఇక తన సినిమా మెంటల్ కృష్ణ ముఖ్యంగా స్త్రీల సమస్యల చుట్టూ తిరుగుతుందని,అందరిని ఆలోచింప చేసేలా ఉంటుందంటున్నారు. ఈ చిత్రాన్ని పోసాని రచనచేసి దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రల కనిపిస్తున్నారు. అలాగే ఆయన సరసన ఆనంద్ సినిమాతో పాపులర్ అయిన సత్య కృష్ణన్ చేస్తోంది.
Story first published: Thursday, November 13, 2008, 16:41 [IST]