పోసాని ఇక 'జెంటిల్ మెన్'
మెంటల్ కృష్ణ పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి త్వరలో జెంటిల్ మెన్ కానున్నారు. ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో ఆయన రూపొందించనున్న చిత్రానికి జెంటిల్ మెన్ అనే టైటిల్ పెట్టటానికి నిర్ణయించుకున్నాడు. ఆ మధ్య రాజావారి చేపల చెరువు వర్కవుట్ కాకపోవటంతో ఈసారన్నా ఆపరేషన్ దుర్యోధన రేంజిలో హిట్ కొట్టాలని యోచిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి పోసాని కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటుడుగా పలురకాల భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు. నల్లమ్ పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 24 ఉదయం ముహూర్తం చేసుకోనుంది. ఇక ఆర్తి తన సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా నీలవేణి, జెంటిల్ మెన్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో జెంటిల్ మెన్ టైటిల్ తో ప్రముఖ దర్శకుడు శంకర్..అర్జున్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు పోసాని ఏ రేంజిలో హిట్ ఇవ్వనున్నాడో వేచి చూడాలి.
posani krishna murali mental krishna gentlemen arti agarwal prp sankar arjun మెంటల్ కృష్ణ పోసాని జెంటిల్ మెన్ శంకర్ అర్జున్ ఆర్తి అగర్వాల్


Click it and Unblock the Notifications