Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెంటల్ మదిలో ‘చిన్న సినిమా.. పెద్ద విజయం’.. రాజ్ కందుకూరి
Recommended Video
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్‌గా మెంటల్ మదిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఈ చిత్రం సూపర్ సక్సెస్ మీట్ జరిగింది.
ఈ సందర్బంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. నేను ప్రతీ సినిమాలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే వుంటాను. నా దగ్గర పని చేసిన వాళ్ళు ఇంకో సినిమాకి పని చేస్తూ కనిపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను పరిచయం చేసిన వాళ్ళు నా కళ్ల ముందు ఎదుగుతూ ఉంటే ఒకింత గర్వంగా కూడా అనిపిస్తుంటుంది. అలాంటి టాలెంట్ వున్నా కుర్రాళ్ళు ఈ సినిమా ద్వారా ఇండస్త్రిలోకి వచ్చారు. దర్శకుడు వివేక్ ఆత్రేయతోపాటు ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నిషియన్స్ భవిష్యత్‌లో గొప్పస్థానంలో వుంటారు. మా ధర్మపత ప్రొడక్షన్స్ ఇలాంటి కొత్త సినిమాలని నిర్మిస్తూనే ఉంటుంది. కొత్త వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తూనే ఉంటుంది అని రాజ్ కందుకూరి సంతోషం వ్యక్తం చేశారు.