హిట్ సినిమా కాదు.. మంచి సినిమా తీద్దామన్నారు.. వివేక్ ఆత్రేయ
Recommended Video

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్‌గా మెంటల్ మదిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఈ చిత్రం సూపర్ సక్సెస్ మీట్ జరిగింది.

ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. మెంటల్ మదిలో చూడగానే అప్పుడే సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. రాజ్ కందుకూరికి నేను కథ చెప్పగానే మనం హిట్టు సినిమా కాదు మంచి సినిమా చేద్దాం అని అన్నారు. అప్పటి నుంచి కథలో మార్పులు చేసి మంచి సినిమాగా రూపొందించడానికి అందరం కష్టపడ్డాం. అందుకే మీ ముందు ఓ మంచి చిత్రంగా నిలిచింది. సినిమా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్దరో నాకు తెలుసు. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అని వివేక్ ఆత్రేయ ఉద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











