Taraka Ratna పార్థివ దేహం వద్ద ఊహించని సీన్.. 'బాలయ్య జాగ్రత్తగా ఉండు' అంటూ హెచ్చరిక!
సినీ చిత్రసీమలో హీరోగా, విలన్ గా అలరించి.. రాజకీయాల్లోకి అడుగుపెడదామనుకుని ఊహించని విధంగా గుండెపోటుతో మరణించారు నందమూరి తారకరత్న. జనవరి 27న గుండెపోటుతో హాస్పిటల్ చేరిన ఆయన 23 రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ లోకం విషాదంలో నిండిపోయింది. దీంతో ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు, సంతాపం తెలిపారు. ఇక సోమవారం రోజున నందమూరి తారకరత్నకు కన్నిటీ వీడ్కోలు చెప్పారు. ఇదిలా ఉంటే అభిమానుల సందర్శనార్థం ఫిలీం చాంబర్ లో తారకరత్న పార్థీవ దేహం ఉంచగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేయడం చర్చనీయాంశమైంది.

ఫిబ్రవరి 20న..
జనవరి 27న జరిగిన కుప్పంలోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే కుప్పకూలిన తారకరత్నకు గుండెపోటు అని వైద్యులు నిర్ధరించగా.. బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే 23 రోజులుగా మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూశారు. సోమవారం ఉదయం అంటే ఫిబ్రవరి 20న ఫిలీం నగర్ లోని ఫిలీం చాంబర్ కు తరలించారు.

ఊహించని సంఘటన..
అభిమానుల సందర్శనార్థం నందమూరి తారకరత్న పార్థివదేహాన్ని ఫిబ్రవరి 20న ఉదయం 10 గంటలకు ఫిలీం చాంబర్ లో ఉంచారు. తారకరత్నను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, నందమూరి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. తారకరత్నను కన్నీటి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే తారకరత్న భౌతిక కాయం వద్ద అనూహ్యంగా ఊహించని సంఘటన జరిగింది. అక్కడే ఉన్న బాలకృష్ణకు వేలు చూపిస్తూ మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.

బాలకృష్ణ వద్దకు వెళ్లి..
నందమూరి తారకరత్నకు అభిమానులు, రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ బాలకృష్ణతోపాటు కుటుంబ సభ్యులు, మామయ్య వరుసైన విజయ సాయిరెడ్డి అందరూ ఉన్నారు. అక్కడికి తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించేందుకు అభిమానులతోపాటు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కూడా వచ్చాడు. తారకరత్నకు నివాళులు అర్పించాడు. అనంతరం అక్కడే ఉన్న బాలకృష్ణ వద్దకు నేరుగా వెళ్లాడు.

జాగ్రత్తగా ఉండు బాలయ్య..
బాలకృష్ణ వద్దకు నేరుగా వెళ్లిన ఆ మతిస్థిమితం లేని వ్యక్తి పెద్ద పెద్దగా మాట్లాడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వైపు వేలు చూపిస్తూ బాలయ్య జాగ్రత్తగా ఉండు.. అంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి చెబుతున్న మాటలను బాలకృష్ణ కూడా అంతే శ్రద్ధగా విన్నారు. పోలీసులు కొద్దిగా వారిస్తున్న ఆ వ్యక్తి మాత్రం అలానే ఏదోదో చెప్పాడు. అనంతరం ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే పలు విషాదాలు..
ఇదిలా ఉంటే సినిమాల్లో జరిగే సన్నివేశం ఇలా నిజంగా జరగటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లోగే ఒక పిచ్చోడు రావడం ఏంటీ.. బాలయ్యను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఏంటని నానా రకాలుగా నెటిజన్లు, ఆ వీడియో చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో పలు విషాదాలు జరగ్గా.. ఇప్పుడు తారకరత్న అకాల మరణం చెందటం ఆ ఫ్యామిలీలో మరింత తీవ్ర విషాదాన్ని నింపింది.

కొట్టిపారేస్తున్న పోలీసులు..
ఇలాంటి సమయంలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బాలయ్యను వారించడంతో అభిమానులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ మతిస్తిమితం లేని వ్యక్తి అక్కడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా అతని మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











