twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముద్దుగా ‘చేత వెన్న ముద్ద’

    By Sindhu
    |

    నటుడు 'కృష్ణడు",'ఓయ్" చిత్రంలో కడుపుబ్బా నవ్వించి, 'వినాయకుడు" సినిమామలో కీలక పాత్ర వహిస్తూ, అల్తాఫ్ హీరో, హాపిడేస్ చిత్రం ద్వారా పరిచయమైన 'క్రితిక క్రిష్టన్" హీరోయిన్ గా 'చేత వెన్న ముద్ద" చిత్రంలో నటించనున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివర వరకూ కృష్ణుడు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారని దర్శకుడు తెలిపారు. తెలుగులో తొలిసారిగా మెర్సీ కిల్లింగ్ పై నిర్మిస్తున్న చిత్రం. ఈ చిత్రాన్ని పుల్ మూన్ పిక్చర్స్ పతాకంపై రోహిత్ ఎస్ అభ్యుదయ్ దర్శకత్వంలో పి.ఆర్ కుమార్ నిర్మిస్తున్నారు.

    ఈ చిత్ర కథాపరంగా గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడ్డ శూన్యతను కాలం ఎలా పరిష్కరించిందనేది ముఖ్య కథాంశమని దర్శకుడు రోహిత్ తెలిపారు. కృష్ణడు, స్పెయిన్ అమ్మాయి అన్నా జెన్, మెటిల్డా, మైక్, శశిలపై ఇటీవల తీసిన కొన్ని కామెడీ సన్నివేశాలతో సగం సినిమా పూర్తవుతుందనీ, అక్టోబర్ ద్వితీయార్థం నుంచి జరిగి షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ ఆయన రోహిత్ తెలిపారు.హీరో అల్తాఫ్, క్రితిక క్రిష్ణన్ లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ప్రేమికుల్లో కొత్త అనుభూతిని, థ్రిల్లింగిని కలిగిస్తాయని, ప్రేమికులంతా చూడదగ్గ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు. చివరి షెడ్యూల్ లో రెండు పాటలను చిత్రీకరించి అక్టోబర్ చివరన ఆడియోను, నవంబర్ లో సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మెర్సీకిల్లింగ్ పై రూపొందుతున్న కొత్త కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చిత్ర సమర్పకుడు బెల్లంకొండ రఘు తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X