twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ సినిమాలే టాప్: 2017లో ట్విట్టర్లో సునామీ సృష్టించిన సినిమాలు ఇవే...

    By Bojja Kumar
    |

    Recommended Video

    ట్విట్టర్లో దుమ్ము రేపిన సినిమాలు ఇవే

    ఒకప్పుడు ఏ విషయంలో అయినా బాలీవుడ్ సినిమాలే టాప్‌లో ఉండేవి. అయితే క్రమ క్రమంగా సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి. 2017లో తెలుగు సినీ పరిశ్రమ నుండి వచ్చిన 'బాహుబలి 2' చిత్రం బాలీవుడ్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

    ఇటీవల గూగుల్ విడుదల చేసిన రిపోర్టులో బాహుబలి సాంగ్, బాహుబలి గేమ్ టాప్ నెం.1 అని తేలింది. తాజాగా ట్విట్టర్ విడుదల చేసిన రిపోర్టు కూడా సౌత్ సినిమాలే ఈ ఏడాది ట్విట్టర్లో సునామీ క్రియేట్ చేసినట్లు స్పష్టం చేస్తోంది.

    బాహుబలి, మెర్సల్ టాప్

    బాహుబలి, మెర్సల్ టాప్

    మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో 2017లో ఎక్కువగా బాహుబలి, మెర్సల్ గురించే చర్చించారని, 2017 ప్రథమార్థంలో బాహుబలి డామినేషన్ కొనసాగిందని, ద్వితీయార్థంలో ‘మెర్సల్' గురించి ఎక్కువ చర్చ జరిగిందని ట్విట్టర్ ఓ రిపోర్టు విడుదల చేసింది.

    దుమ్మురేపిన బాహుబలి

    దుమ్మురేపిన బాహుబలి

    ‘బాహుబలి' సినిమా గురించి జరిగినంత చర్చ ఏ సినిమాపై జరుగలేదని, ఈ సినిమా విడుదల ముందు చాలా మంది దీని గురించి చర్చించారని, విడుదల తర్వాత చర్చ రెట్టింపు స్థాయికి చేరిందని ట్విట్టర్ వెల్లడించింది.

    1.7 మిలియన్ ట్వీట్స్

    1.7 మిలియన్ ట్వీట్స్

    మెర్సల్ సినిమా గురించి మూడు రోజుల్లోనే 1.7 మిలియన్ ట్వీట్స్ చేశారని, ఈ ఏడాది టాప్ హాష్ ట్యాగ్ ట్రెడింగ్‌లో కూడా మెర్సల్ మొదటి స్థానంలో నిలిచిందని ట్విట్టర్ ప్రకటించింది.

     ట్విట్టర్ ఈమోజీ కలిగిన మొదటి చిత్రం

    ట్విట్టర్ ఈమోజీ కలిగిన మొదటి చిత్రం

    సొంత ట్విట్టర్ ఈమోజీ కలిగిన తొలి చిత్రంగా కూడా ‘మెర్సల్' రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇలాంటి సొంత ట్విట్టర్ ఈమోజీ కలిగి లేదు. ఇకపై ఇలాంటి ఈమోజీలు వచ్చే అవకాశం ఉంది.

     ఆ విషయంలో సూర్య మూవీ టాప్

    ఆ విషయంలో సూర్య మూవీ టాప్

    సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'తానా సెరెంద కూట్టమ్‌'. ఈ సినిమాపై సూర్య ట్వీట్ చేయగా ఏడాది అత్యధిక మంది రిట్వీట్ చేసిన ట్వీట్‌గా నిలిచింది. దీన్ని 68,808 రీ ట్వీట్, 112,984 లైక్స్ వచ్చాయి.

    English summary
    South have ruled all the way in terms of qualitative cinema and box office numbers in 2017. Twitter’s report on the most influential moments of 2017 further reaffirms this fact! As per the report, Baahubali and Mersal were the most talked about topics on the microblogging site this year. While Baahubali dominated the first part of 2017, Mersal took over in the latter half.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X