twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దంగల్ రికార్డు బద్దలు, నిజంగానే ఓవర్సీస్ లో "అదిరింది": ఒక్కరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా

    కోలీవుడ్ లో రజినీ తర్వాత సూపర్ స్టార్ అనిపిన్ పిలిపించుకునే స్థాయి హీరోకి తెలుగు లో మాత్రం కనీస లెక్కలో కూడా వసూళ్ళు ఉండవు. తుపాకీ, పోలీసోడు లాంటి సినిమాలతో తెలుగు మార్కెట్ లో ప్రవేశించాలని చూసినా దార

    |

    Recommended Video

    "మెర్సల్" ఒక్కరోజు కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకే..

    కోలీవుడ్ లో రజినీ తర్వాత సూపర్ స్టార్ అనిపిన్ పిలిపించుకునే స్థాయి హీరోకి తెలుగు లో మాత్రం కనీస లెక్కలో కూడా వసూళ్ళు ఉండవు. తుపాకీ, పోలీసోడు లాంటి సినిమాలతో తెలుగు మార్కెట్ లో ప్రవేశించాలని చూసినా దారుణమైన అపజయమే ఎదురయ్యింది. అయినా నిరాశపడని విజయ్ ఈసారి తన కొత్త సినిమా "మెర్సల్" ని "అదిరింది" పేరుతో తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సారి కూడా విజయ్ కి పెద్దగా కలిసి వస్తుందన్న నమ్మకం ఏమీ లేదు...అనుకున్నారు కానీ "అదిరింది" నిజంగానే తెలుగులోకూడా అదరగొట్టేటట్టే ఉంది. ఆశ్చర్య కరమైన స్థాయిలో వచ్చిన ఓవర్సీస్ వసూల్లే దీనికి నిదర్శనం. ఇండియన్ హిశ్టరీలోనే వసూళ్ళ రికార్డు అనిపించుకున్న "దంగల్" రికార్డుని ఒక్క రోజులో బద్దలు కొట్టాడు విజయ్...

    2500కు పైగా థియేటర్లలో రిలీజ్

    2500కు పైగా థియేటర్లలో రిలీజ్

    తమిళ్ లో "మెర్సల్" సంచలనం గా మారింది. తమిళంలోనే ఈ చిత్రం 2500కు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సనిమా తెలుగు వెర్షన్ కూడా కలిపితే లెక్క 330 చేరుతోంది. ఇప్పటిదాకా ఏ తమిళ సినిమా కూడా ఇంత భారీగా విడుదలైంది లేదు. రజినీ సినిమా ‘కబాలి'ని కూడా ఇంతకంటే తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేశారట.

    "బాహుబలి" తర్వాత

    "బాహుబలి" తర్వాత ఇంత భారీ స్థాయిలో రిలీజవుతున్న దక్షిణాది చిత్రం ఇదే. అమెరికాలో మామూలుగా తమిళ సినిమాలు తక్కువ థియేటర్లలోనే రిలీజవుతుంటాయి. కానీ ‘మెర్శల్'ను మాత్రం అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేసారు. కొన్నాళ్ళకిందటి వరకూ ఓవర్సీస్లో ఎక్కువ భాగం భారతీయ సినిమాల్లో భాలీవుడ్ దే అగ్రస్థానం.

     కలెక్షన్ల మోత మోగించింది.

    కలెక్షన్ల మోత మోగించింది.

    కానీ ఈ మధ్య పరిస్థితి మారింది. ప్రాంతీయ భాషా చిత్రాలకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు బాలీవుడ్ సినిమాలను కూడా కలెక్షన్ల పరంగా వెనుకబడేస్తున్నాయి. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన తమిళ హీరో విజయ్ కొత్త సినిమా మెర్సల్(అదిరింది) కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగించింది.

    2కోట్ల 32లక్షలు

    2కోట్ల 32లక్షలు

    ఒక్కరోజులోనే మొత్తం 3లక్షల 57 వేల 925డాలర్లు(2కోట్ల 32లక్షలు) యూఎస్ లో కలెక్ట్ చేసింది. అమీర్‌ఖాన్ బ్లాక్‌బాస్టర్ హిట్ దంగల్ కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్లు రాబట్టలేకపోయిందని అట్మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది. దంగల్ మొదటి రోజు కలెక్షన్లు 3లక్షల 28వేల డాలర్లు. అలాగే షారుఖ్‌ఖాన్ రాయిస్ సినిమా రికార్డును కూడా మెర్సల్ బద్దలుకొట్టింది. షారుఖ్ సినిమా మొదటి రోజు 3లక్షల 49వేల డాలర్లు మాత్రమే రాబట్టగలిగింది.

    తొలిరోజే రూ.19 కోట్ల బిజినెస్

    తొలిరోజే రూ.19 కోట్ల బిజినెస్

    తమిళనాడులో విజయ్‌కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమా తొలిరోజే రూ.19 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక్క చెన్నైలోనే రెండు కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషమని విజయ్ అభిమానులు తెలుపుతున్నారు. ఇక అమెరికాలో 250 స్క్రీన్‌లపై భారీగా విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు రూ. 2.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక ఆస్ట్రేలియా, మలేసియా, యూకేలలోనూ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టి మెర్సల్ సత్తా చాటుతుంది.

    తొలిరోజు 31 కోట్ల వసూళ్లు

    తొలిరోజు 31 కోట్ల వసూళ్లు

    మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 31 కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.160 కోట్ల బిజినెస్‌ను సాధించగా.. ఇప్పుడె సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా సమంత, కాజల్‌, నిత్యామేనన్‌ నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

    అత్యధిక బిజినెస్‌ చేసిన చిత్రంగా

    అత్యధిక బిజినెస్‌ చేసిన చిత్రంగా

    రజనీకాంత్‌ సినిమాలని మినహాయిస్తే తమిళ చిత్రాల్లో అత్యధిక బిజినెస్‌ చేసిన చిత్రంగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేస్తే దీనిని హిట్‌ కింద లెక్కేసుకోవచ్చునట. హైప్‌ అయితే పతాక స్థాయిలో వుంది కనుక ఈ చిత్రం ఖచ్చితంగా బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుందని అనుకుంటున్నారు. .

    English summary
    According to Forbes, the action thriller "Mersal" had a $357,925 opening in the US, beating the day 1 collection of films like Aamir Khan’s Dangal and Shah Rukh Khan’s Raees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X