twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిస్ట్రిబ్యూటర్ సంచలన కామెంట్స్: ‘మెర్సల్’ 200 కోట్ల కలెక్షన్ అంతా ఫేక్!

    విజయ్ చిత్రం ‘మెర్సల్’ రూ. 200 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే ఇది ఫేక్ కలెక్షన్ రిపోర్ట్ అని డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ ఆరోపించారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mersal again in the discussions with fake collections ‘మెర్సల్’ కలెక్షన్స్ ఫేకా ?

    దీపావళికి విడుదలైన చిత్రం 'మెర్సల్' ఇపుడు తమిళనాడులో హాట్ టాపిక్. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని, రజనీకాంత్ 'యంతిరన్'(రోబో) తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండవ తమిళ చిత్రం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.

    విజయ్ నటించిన ఈ మూవీ ఇప్పటికే 'జిఎస్టీ' వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో వివాదం నెలకొంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

    ‘మెర్సల్’ కలెక్షన్లు ఫేక్

    ‘మెర్సల్’ కలెక్షన్లు ఫేక్

    ‘మెర్సల్' మూవీ కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని, ఈ సినిమా అంత వసూలు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందన్న ప్రచారాన్ని అస్సలు నమ్మ వద్దని అభిరామి రామనాథన్ అన్నారు.

    ప్రేక్షకులను మభ్యపెడుతున్నారు

    ప్రేక్షకులను మభ్యపెడుతున్నారు

    ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తూ మభ్య పెడుతున్నారని, ఈ సినిమా అంత వసూలు చేయలేదని అభిరామి రామనాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    1976 నుండి ఫీల్డులో అభిరామి రామనాథన్

    1976 నుండి ఫీల్డులో అభిరామి రామనాథన్

    చెన్నైలో పలు మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్ కలిగిన అభిరామి రామనాథన్ 1976 నుండి ఫిల్మ్ డస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో ఉన్నారు. ఇలాంటి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ‘మెర్సల్' సినిమా విషయంలో ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.

    కలెక్షన్ ఎంత అనేది ఫైనల్ రన్ వరకు తెలియదు

    కలెక్షన్ ఎంత అనేది ఫైనల్ రన్ వరకు తెలియదు

    ఒక సినిమా ఎంత వసూలు చేసింది అనేది ఫైనల్ థియేట్రికల్ రన్ వరకు నిర్మాతలకు తెలియదు. కేవలం సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిరామి రామనాథన్ వ్యాఖ్యానించారు.

    తెలుగు రిలీజ్ ఎప్పుడో?

    తెలుగు రిలీజ్ ఎప్పుడో?

    ‘మెర్సల్' తెలుగులో ‘అదిరింది' పేరుతో అక్టోబర్ 27న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు. అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అయితే అందులో నిజం లేదు అంటున్నారు కేంద్ర సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి. మెర్సల్ తెలుగు వెర్షన్ ‘ఆదిరింది' మూవీకి తాము ఇప్పటికే సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చామని, ఒక్క కట్ కూడా చేయలేదన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

    జిఎస్టీ వివాదం

    జిఎస్టీ వివాదం

    ‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీ‌ని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా. అయితే కోర్టు నుండి మెర్సల్ చిత్రానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, మెర్సల్ అనేది కేవలం సినిమా, నిజ జీవితం కాదని కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

    English summary
    Mersal is the latest Tamil film in the discussions. Popular Tamil distributor Abhirami Ramanthan made some sensational comments on the film. The distributor has commented that the makers are projecting the fake collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X