మెర్సల్ కలెక్షన్ల సునామీ.. గోల్‌మాల్, సీక్రెట్ సూపర్‌స్టార్, కబాలి రికార్డులు మటాష్

By Rajababu

దీపావళీ కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం కలెక్షన్లపరంగా దుమ్మురేపుతున్నది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను అధిగమించి దూసుకెళ్తున్నది. ఓవర్సీస్ మార్కెట్లలో ఈ చిత్రం వసూలు చేస్తున్న ఈ చిత్ర కలెక్షన్లు ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జీఎస్టీ, డిజిటల్ ఇండియా కార్యక్రమాలపై విసిరిన సెటైర్ల వివాదంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.

 వందకోట్ల క్లబ్‌లో..

వందకోట్ల క్లబ్‌లో..

మెర్సల్ కలెక్షన్ల జోరు ఎలా ఉందంటే తొలి వారాంతానికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తమిళ చిత్ర సీమలోని కబాలి, వివేకం చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసింది. మెడికల్ మాఫియాపై ధ్వజమెత్తుతూ రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నది.

 ఓవర్సీస్ మార్కెట్‌లో

ఓవర్సీస్ మార్కెట్‌లో

అక్టోబర్ 18న రిలీజ్ అయిన మెర్సల్ చిత్రానికి నార్త్ అమెరికా, మలేషియా, న్యూజిలాండ్, యూకే, ఆస్ట్రేలియాలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నది. అజయ్ దేవగన్ నటించిన గోల్‌మాల్ అగైన్, అమీర్ నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాల వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది.

నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న..

నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న..

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం విశేష ఆదరణ కూడగట్టుకొంటున్నది. నార్త్ అమెరికాలో 7.6 కోట్లు, మలేషియాలో 3.57 కోట్లు, న్యూజిలాండ్‌లో 13.62 లక్షలు, యూకే‌లో 3.11 కోట్లు, ఆస్ట్రేలియాలో 2 కోట్లు వసూళు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

 గోల్‌మాల్, ‘సీక్రెట్'‌కు చుక్కెదరు

గోల్‌మాల్, ‘సీక్రెట్'‌కు చుక్కెదరు

తమిళ చిత్రం మెర్సల్ ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్నది. బాలీవుడ్‌లో భారీ చిత్రాల రిలీజ్‌ను తట్టుకొని దూసుకెళ్తున్నది. విదేశాలలో గోల్‌మాల్ అగైన్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాల కలెక్షన్ల కంటే ఈ చిత్ర కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి.

 తమిళనాట బీభత్సమైన కలెక్షన్లు

తమిళనాట బీభత్సమైన కలెక్షన్లు

ఇక చెన్నై సిటీలో మెర్సల్ కలెక్షన్లు బీభత్సంగా ఉన్నాయి. తొలి రోజనే ఈ చిత్రం 22.5 కోట్ల వసూళ్లను సాధించింది. తొలి రోజు కలెక్షన్లను చూసుకొంటే కబాలి రికార్డులను తుడిచిపెట్టేసింది. కబాలి తొలి రోజు కలెక్షన్లు 23.5 కోట్లు అని ఫోర్డ్స్ పత్రిక పేర్కొన్నది.

 అక్రమ దందాలపై మెర్సల్

అక్రమ దందాలపై మెర్సల్

మెడికల్, హెల్త్ రంగాల్లో వేళ్లూనుకొన్న అక్రమ దందాలపై మెర్సల్ చిత్రం సూటిగా ప్రశ్నించింది. పేద ప్రజలకు అందాల్సిన వైద్యంపై 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంపై ప్రభుత్వాలను సినిమాలో హీరో విజయ్ తీవ్రంగా విమర్శించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

 జీఎస్టీపై విజయ్ ఎటాక్

జీఎస్టీపై విజయ్ ఎటాక్

క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో.. సింగపూర్‌లో వైద్య సేవలపై జీఎస్టీ కేవలం 7 శాతం. అయితే అక్కడ ఉచితంగా మందులు ఇస్తారు. కానీ మనదేశంలో అదే వైద్య సేవలపై విధించేంది 28 శాతం, అదనంగా మందుల కొనుగోలుపై 12 శాతం పన్ను విధిస్తారు. ఇదెక్కడి న్యాయం. పేద కుటుంబాలకు శాపంగా మారిన మద్యంపై ఇక్కడ ఎలాంటి పన్ను ఉండదు. ఇది మన ప్రభుత్వాల తీరు అని హీరో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇలాంటి సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్ల సునామీ కొనసాగుతున్నది.

మెర్సల్ డైలాగ్స్‌పై బీజేపీ అభ్యంతరం

మెర్సల్ డైలాగ్స్‌పై బీజేపీ అభ్యంతరం

జీఎస్టీని టార్గెట్ చేసుకొని సినిమాలో విజయ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలు సరికాదు. వెంటనే ఆ డైలాగ్స్‌ను తొలగించాలి అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఓ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో మెర్సల్ చిత్రంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

 130 కోట్ల బడ్జెట్‌తో

130 కోట్ల బడ్జెట్‌తో

సుమారు 130 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విజయ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యమీనన్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X