twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జంజీర్’ తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు: యోగి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న 'జంజీర్' చిత్రం తెలుగులో 'మెరుపు' పేరుతో విడుదలవుతోందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. జంజీర్ తెలుగు వెర్షన్ దర్శకుడు యోగి మాట్లాడుతూ ఇవన్నీ నిరాధారమైన పుకార్లని స్పష్టం చేసారు.

    'జంజీర్' తెలుగు వెర్షన్‌కి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, అనేక టైటిళ్లు పరిశీలిస్తున్నామని.... అధికారిక ప్రకటన వెలువడటానికి ఇంకా సమయం పడుతుందని 'యోగి' స్పష్టం చేసారు. త్వరలో ప్రారంభం కానున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్-3 సందర్భంగా 'జంజీర్' టీజర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, వైజాగ్‌లో జరిగే సిసిఎల్-3 మ్యాచ్ సందర్భంగా టీజర్ ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

    అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రియల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు.

    English summary
    "All these are rumors and are baseless. Zanjeer has been titled Merupu. We are not even considering such a title and need some more time to title it", said director of the Zanjeer's Telugu version Yogi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X