చరణ్ ‘మెరుపు’ ఆగిపోలేదట...మళ్ళీ వస్తుందట...!
పవన్ కళ్యాణ్ 'బంగారం" దర్శకుడు ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా అట్టహాసంగా ఆరంభమైన 'మెరుపు" చిత్రం బడ్జెట్ ప్రాబ్లమ్ తో ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆగిపోలేదని, తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ఎప్పుడైనా ఆరంభమయ్యే అవకాశాలున్నాయని సూపర్ గుడ్ ఫిలింస్ అంటోంది. రామ్ చరణ్ తో ఈ సంస్థ 'రచ్చ" సినిమా ఆరంభించింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత 'మెరుపు" చేయాలనుకుంటున్నారట.
ఈ చిత్ర దర్శకుడు థరణి కూడా రామ్ చరణ్ టచ్ లో ఉంటున్నాడని, కథ మరింత పకడ్బందీగా చేస్తున్నాడని వినికిడి. బడ్జెట్, కథ అన్ని పక్కాగా కుదిరిన వెంటనే 'మెరుపు" ఆరంభించడానికి సూపర్ గుడ్ సంస్థ సిద్దంగా ఉందని సమాచారం. ఈ విషయాన్ని 'రచ్చ" ప్రారంభోత్సవంలో మాత్రం 'మెరుపు"ను రచ్చతర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ చెప్పుకురావడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది...


Click it and Unblock the Notifications











