రంగస్థలంలో మళ్ళీ సందడి.. మొదలు పెట్టిన మెగాస్టార్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ విజయం సాధించింది. వందకోట్లకు పైగా షేర్ సాధించి బాహుబలి తరువాత టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
కాగా ఈ చిత్రంలో రంగస్థలం విలేజ్ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగస్థలం చిత్రంలో నిర్మించిన అద్భుతమైన సెట్ అందరిని ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ పూర్తయిపోయింది.. సినిమా కూడాఘన విజయం సాధించడంతో ఆ సెట్ వెలవెలబోతోంది. కానీ రంగస్థలానికి మళ్ళీ కొత్త కళ వచ్చింది.

అదే సెట్ లో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సైరా చిత్రానికి సంబందించిన కొన్ని విలేజ్ సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారట. సైరా చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











