నన్ను రేప్ చేశాడు... ప్రముఖ నటుడిపై నిర్మాత సంచలన ఆరోపణలు!
Recommended Video

తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ ఇష్యూ తర్వాత దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఎవరూ ఊహించని పలువురి పేర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా #మీటూ ఉద్యమంలో స్క్రీన్ రైటర్, నిర్మాత, డైరెక్టర్ వినితా నందా చేరారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో భారీ లేఖను పోస్టు చేశారు. 20 ఏళ్ల క్రితం ప్రముఖ టీవీ నటుడు తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో 'సంస్కారి' ఇమేజ్ ఉన్న ప్రముఖ నటుడు అలోక్ నాథ్ మీద ఆమె ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

ఎవరీ అలోక్ నాథ్
అలోక్ నాథ్ 90ల్లో ‘తారా' అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. తర్వాత పలు సినిమాల్లోనూ నటించారు. రెండు దశాబ్దాల క్రితం అతడు తనపై చేసిన లైంగిక దాడి గురించి #మీటూ ఉద్యమంలో భాగంగా వినితా నందా వెల్లడించారు.

తన కారులో ఎక్కించుకుని...
ఖళీగా ఉన్న రోడ్డులో నేను నడుచుకుంటూ వెళుతుడంగా... తన సొంత కారు నడుపుకుంటూ వచ్చిన అలోక్ నాథ్ నన్ను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. అతడిని నమ్మి కారు ఎక్కాను. ఆ తర్వాత అతడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు వినితా నందా తెలిపారు.

నాతో మద్యం తాగించి...
అపుడు జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. నా నోట్లో బలవంతంగా మద్యం పోయడంతో నేను అపస్మారక స్థితిలోకి వెళ్లాను. మరుసటిరోజు మధ్యాహ్నం నేను నిద్ర లేచాను. ఆ సమయంలో చాలా నొప్పిగా అనిపించింది. నాపై రేప్ జరిగినట్లు అర్థమైంది అని వినితా నందా తెలిపారు.

నా సొంత ఇంట్లోనే దారుణం
ఆ సమయంలో నేను కూడా టీవీ రంగంలో ఉండటం వల్ల అలోక్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరయ్యాను. ఆ రోజు రాత్రి డ్రింక్‌లో ఏదో కలిపారనే అనుమానం కలిగింది. రాత్రి 2 గంటల సమయంలో నా ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాను. అతడను మధ్యలో వచ్చి ఇంటిదగ్గర దింపుతానని కారు ఎక్కించుకున్నాడు. నా ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడే నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని వినితా నంద తెలిపారు.

నా స్నేహితులకు చెబితే...
ఈ విషయాన్ని నేను నా స్నేహితులకు చెప్పాను. వారు ఈ విషయాన్ని మరిచిపోయి జీవితంలో ముందుకు సాగాలని చెప్పారు. అప్పడు నా కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే భయంతో సైలెంటుగా ఉండిపోయాను అని వినితా నంద తెలిపారు.


Click it and Unblock the Notifications











