#మీటూ ఉద్యమంలో మరో షాక్: నటిపై మరో నటి లైంగిక వేధింపులు
కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువగా ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన వారే పాల్గొంటున్నారు. ఇవన్నీ ఎక్కువగా మహిళలపై పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలే. తర్వాత కొందరు మగాళ్లు కూడా తాము ఆడవారి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు.
అయితే తాజాగా #మీటూ ఉద్యమంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. ఒక మహిళ... మరో మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ విషయం ఇపుడు తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

లైంగికంగా, మానసికంగా...
థియేటర్ ఆర్టిస్ట్ అనన్య రాంప్రసాద్..... నటి మాయ ఎస్ కృష్ణన్ మీద #మీటూ ఆరోపణలు చేశారు. ఆమె తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు పాల్పడినట్లు అనన్య రాంప్రసాద్ ఆరోపించారు.

నన్ను అన్ని రకాలుగా నాశనం చేసింది
నటి మాయ ఎస్ కృష్ణన్ తన జీవితాన్ని సర్వనాశనం చేసిందని... ఆమె వల్ల నా ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్ దూరం అయ్యాయని, ఆమె వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో, ఆమె ప్రవర్తన తనను మానసికంగా కృంగిపోయేలా చేసిందని అనన్య రాంప్రసాద్ ఆరోపించారు.

ఆమె గురించి సుధీర్గంగా...
నన్ను వేధించిన వ్యక్తి ఒక మగాడు అయుంటే ఈ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడేదాన్ని కాదు. కానీ నేను వేధింపులకు గురైంది మరొక మహిళ ద్వారా అంటూ అనన్య రాంప్రసాద్ తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో సుధీర్ఘమైన పోస్టు పెట్టారు.

18 ఏళ్ల వయసులో...
2016లో ఆమె నాకు పరిచయం అయింది. నాకు 18 ఏళ్ల వయసున్నపుడు ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆ సమయంలో నన్ను మానిప్యులేట్ చేసి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంది అంటూ అనన్య రాంప్రసాద్ ఆరోపణలు చేశారు.

అతడితో కూడా...
ఈ సందర్భంగా మీకు మరో విషయం కూడా చెప్పాలి. అశ్విన్ రామ్ అనే మరో కుర్రాడితో కూడా మాయాకు రిలేషన్ షిప్ ఉండేది. నాతో పిజికల్ రిలేషన్ మొదలు పెట్టడానికి ముందే అతడితో ఆమెకు పరిచయమైంది. అయితే అతడిని కారు నడపటానికి, జిమ్ ట్రైనర్‌గా వినియోగించుకుంటున్నాను అని చెప్పేది.... అని అనన్య రాంప్రసాద్ తన పోస్టులో చెప్పుకొచ్చారు.

నేను ఆ టైపు కాదు కానీ...
నేను ఉమెన్ వైపు అట్రాక్ట్ అయ్యే టైపు కాదు.... కానీ నన్ను మానిప్యులేట్ చేసింది. తర్వాత నన్ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఆమె తీసుకునేది. చివరకు నా కుటుంబం, నా స్నేహితులను నాకు దూరం అయ్యే పరిస్థితుల్లోకి నెట్టివేసింది అని అనన్య రాంప్రసాద్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











