twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీటూ: హీరోయిన్ శృతి కేసులో అర్జున్‌ను అరెస్టు చేస్తారా?

    |

    ప్రముఖ నటుడు అర్జున్ సార్జా తనను కన్నడ చిత్రం 'విస్మయ' షూటింగ్ సమయంలో లైంగికంగా వేధించాడంటూ నటి శృతి హరిహరన్ బెంగుళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Recommended Video

    Sruthi Hariharan Says No Compromise With Arjun Sarja

    శృతి ఫిర్యాదు అనంతరం.... అర్జున్ త్వరలోనే అరెస్టు కాబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయనపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ కూడా బలంగా ఉన్నాయని, ఈ కేసు నుంచి బయట పడటం అంత ఈజీ కాదని అంటున్నారు.

    <strong>లైంగిక వేధింపులు: అర్జున్ ఎక్కడ టచ్ చేశాడో పోలీస్ కంప్లయింట్లో వివరంగా</strong>లైంగిక వేధింపులు: అర్జున్ ఎక్కడ టచ్ చేశాడో పోలీస్ కంప్లయింట్లో వివరంగా

    మూడు సెక్షన్ల కింద కేసు...

    మూడు సెక్షన్ల కింద కేసు...

    అర్జున్ మీద మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో మొదటిది ఐపీసీ 354(మహిళల గౌరవానికి భంగం కలిగించడం), ఐపీసీ 354ఎ (లైంగిక వేధింపులు), 509 (మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడటం లేదా చర్యలు చేయడం) కింద కేసు నమోదు చేశారు.

    రుజువైతే దాదాపు మూడేళ్ల శిక్ష

    రుజువైతే దాదాపు మూడేళ్ల శిక్ష

    2013 చట్టంతో పాటు విశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడానికి ఇంత కాలం అనేది ఏమీ ఉండదు. గతంలో ఎప్పుడో జరిగిన వాటి గురించి కూడా ఎప్పుడైనా ఫిర్యాదు చేయచ్చు. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలితే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

     నిపుణులు ఏమంటున్నారు

    నిపుణులు ఏమంటున్నారు

    అయితే శృతి హరిహరన్ కేసు విషయంలో పోలీసులు... అర్జున్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టేంత పెద్ద నిర్ణయం తీసుకోక పోవచ్చు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం జరుగుతోంది, పైగా శృతి హరిహరన్, అర్జున్ వివాదం కాస్త భిన్నమైనది అని నిఫుణులు అభిప్రాయ పడుతున్నారు.

    మేనేజర్ మీద కూడా?

    మేనేజర్ మీద కూడా?

    అర్జున్ మీద మాత్రమే కాదు.... అతడి మేనేజర్ ప్రశాంత్ సంబర్గి మీద కూడా శృతి హరిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగల్‌గా ముందుకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రశాంత్ సంబర్గి బెదిరించిటన్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

    English summary
    Sruthi Hariharan has lodged a police complaint against Arjun Sarja in the Cubbon Park Police Station on October 28. In the meantime, rumours have started spreading in Bangalore that Arjun will be arrested soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X