మైఖేల్ జాక్సన్ ఎఫెక్ట్: చిరంజీవి ‘దొంగ’ పాట జోరు!
హైదరాబాద్ : చిరంజీవి నటించిన చిత్రాల నుంచి ఎన్నో హిట్ సాంగులు వచ్చాయి. ఆయన చిత్రాల్లోని పాపులర్ పాటలు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే చిరంజీవి నటించిన ‘దొంగ' చిత్రంలోని గోలీమార్ పాట దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత తాజాగా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయింది.
ఈ పాటకు..... మైఖేల్ జాక్సన్ రూపొందంచిన ‘థ్రిల్లర్' ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. దీంతో చిరంజీవికి సంబంధించిన ఈ పాట పాతదే అయినా...మైఖేల్ జాక్సన్ ఎఫెక్టుతో కొత్తదనం సంతరించుకుంది.

మన దేశంలోనే కాదు..ఈ పాట చైనాలో కూడా పాపులర్ అయింది. ఆ మధ్య చైనాలోని ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోలో అదే పాటను ఓ యువకుడు రీమిక్స్ చేసేశాడు. ఆ సాంగు ట్యూన్స్ చైనీయులకు బాగా నచ్చాయి. తెలుగు రాక పోయినా...ఆ పాటకు చైనీయులు తెగ వినేస్తున్నారు. పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం ‘దొంగ' చిత్రంలో గోలి మార్ పాట బాగా పాపులర్ అయింది.
దొంగ సినిమా వివరాల్లోకి వెళితే...ఏ. కోదండరామి రెడ్డి దర్వకత్వంలో రూపొందిన ఈచిత్రానికి త్రివిక్రమరావు నిర్మాత. కె.చక్రవర్తి సంగీతం అందించారు. చిరంజీవి సరసన రాధ హీరోయిన్. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 1985లో ఈచిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











