ఆయన హోమో సెక్సువల్?
పాప్ ప్రపంచపు తిరుగులేని చక్రవర్తి మైఖేల్ జాక్సన్ స్వలింగ సంపర్కుడా అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలోనూ ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా కొంత కాలానికే అవి సమిసిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన మరణం అనంతరం ఆయనకు చాలా మంది 'మగ' స్నేహితులు ఉండేవారు అంటూ తాజాగా విడుదలైన ఓ పుస్తకం రిలీజైంది. 'అన్ మాస్క్ డ్: ది ఫైనల్ ఇయర్స్ ఆఫ్ మైఖేల్ జాక్సన్' అనే పేరుతో విడుదలైన ఈ పుస్తకంలో జీవిత కథల రచయిత ఇయాన్ హాల్పెరిన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. జాక్సన్ అర్ధరాత్రి పూట అమ్మాయి వేషంలో బయటికి వచ్చి తన స్నేహితులను కలుసుకునేవాడని ఈ పుస్తకంలో రాసారు. ఇక ఈ పుస్తకాన్ని ఉటంకిస్తూ సన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. జాక్సన్ స్నేహితులను అనేకమందిని ఇంటర్వ్యూ చేశానన్న హాల్పెరిన్ వారు జాక్సన్ హోమో సెక్సువల్ అని తనకు చెప్పారని ఈ పుస్తకంలో రాశారు. అదీ సంగతి.
michael jackson gay lovers death unmasked pop star మైఖేల్ జాక్సన్ స్వలింగ సంపర్కుడా హోమో సెక్సువల్ ఇయాన్ హాల్పెరిన్


Click it and Unblock the Notifications