ఆయన తో కలిసి చేద్దామనుకున్నా ప్చ్..రహమాన్
''మైఖేల్ జాక్సన్ మృతి చెందడానికి ముందు రెండు నెలల క్రితం ఆయన్ను కలిశా. నాతో కలిసి పనిచేయడానికి ఆయన ఎంతో ఆసక్తి కనబర్చారు'' అని చెప్తున్నారు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్.అలాగే ''ఇద్దరం కలిసి రెండు సంగీతసభ (కాన్సర్ట్)లు నిర్వహిద్దామన్నారు. 'జయహో' పాటలో బృందగానాన్ని సైతం మెచ్చుకొన్నారు. 'వుయ్ ఆర్ ద వరల్డ్' అనే ఐక్యతా గీతం కూర్చాలని నన్ను కోరారు'' అని రెహమాన్ వివరించారు. మెల్‌బోర్న్ లో ఆయన ఈ విషయాలు గుర్తు చేసుకుని తనను కలిసిన మీడియాతో చెప్పుకొచ్చారు. అంతటి పాప్ సంగీత మహరాజుతో తాను పనిచేయలేక పోవటం తన దురదృష్టంగా అభివర్ణించారు. అయితే తాము కలిసి పనిచేస్తే మరో ధ్రిల్లర్ వంటి అధ్బుతం జరిగేదని,ఆ అవకాశం తనకు కలగలేదని నిట్టూర్చారు రహమాన్. ఈ విషయాలను డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ప్రకటించింది తన తాజా సంచికలో..
More from Filmibeat
మైఖేల్ జాక్సన్ మృతి ఎఆర్ రహమాన్ వుయ్ ఆర్ ద వరల్డ్ ఆస్కార్ స్లమ్ డాగ్ మిలియనీర్ ధ్రిల్లర్ సంగీత సభ జయహో daily telegraph a r rahaman we are the world slum dog millianeere oscar thriller


Click it and Unblock the Notifications











