అనుష్క సినిమాలో హాలీవుడ్ నటుడు.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క భాగమతి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన చిత్రం ఇదొక్కటే. కాగా అనుష్క తన కొత్త సినిమా పనుల్లో బిజీగా మారిపోతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో హేమంత్ మధుకర్ దర్శత్వంలో అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలోని అనుష్క లుక్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ హాలీవుడ్ నటులని కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకోబోతున్నట్లు గతంలో తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

ద్విభాషా చిత్రంగా
అనుష్కకు సౌత్ లో క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దర్శక, నిర్మాతలు నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టారు. అనుష్క గ్లామర్ పాత్రలు చేసినా, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా అద్భుతమైన నటన కనబరుస్తుంది. దీనితో ఆరంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

కళ్ళు చెదిరే రెమ్యునరేషన్
ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మాడ్సెన్ ని ఈ చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి మాడ్సెన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అతడి ఆసక్తిని గమనించిన సైలెన్స్ చిత్ర యూనిట్ అతడిని సంప్రదించిందట. మాడ్సెన్ 3 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మాడ్సెన్ ఈ చిత్రంలో నటించేందుకు సూచన ప్రాయంగా అంగీకరించినప్పటికీ ఖరారు చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

హాలీవుడ్ నటులు
ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలు ఉన్నాయి. అలాంటి పాత్రలకు హాలీవుడ్ నటులనే తీసుకోవాలని కోనవెంకట్ భావిస్తున్నారు. వారు నటిస్తే సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు, సన్నివేశాలు అద్భుతంగా పండుతాయని కోనవెంకట్ తెలిపారు. అందుకేమైకేల్ మాడ్సెన్ కు భారీ రెమ్యునరేషన్ అందించేందుకు కూడా వెనుకాడడం లేదు.

బరువు తగ్గి
ఇదిలా ఉండగా అనుష్క కూడా ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి చేస్తోంది. తన లుక్ కోసం విదేశాలకు వెళ్లి మరీ బరువు తగ్గింది. భాగమతి చిత్రం తర్వాత అనుష్క కాస్త బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ప్రీలుక్ లో అనుష్క కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా మారిపోయిందని ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











