దిల్ రాజు, సాయి కిరణ్ అడివి కలిసి చేస్తున్న చిత్రం డిటేల్స్
వినాయకుడు తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి త్వరలో మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ స్టేజీలో ఉన్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
'హ్యాపీ డేస్' చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ జె మేయర్ ఆ తరవాత 'కొత్తబంగారు లోకం' చిత్రానికి చేసారు.అనంతరం మళ్లీ శేఖర్ కమ్ములతోనే 'లీడర్' కి చేసారు. 'లీడర్' ఆడియో అనుకున్నంత హిట్ కాకపోవటంతో ఆ తరవాత ఏ సినిమాను కమిట్ కాలేదు. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా చెబుతున్న 'కేరింత' సినిమా నటి నటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తిచేసుకుని అక్టోబర్ లో సెట్స్ ఫైకి వెళ్ళనుంది. ఇక దర్శకుడు అడవి సాయికిరణ్ ..విలేజ్ లో వినాయకుడు చిత్రం అనంతరం ఏ సినిమానూ చేయలేదు. ఇక ఈ చిత్రానికి కెమెరామెన్ గా కుదిరితే కాఫీ కప్పు చిత్రాన్ని డైరక్ట్ చేసిన రమణ సెల్వా పనిచేయనున్నారు.


Click it and Unblock the Notifications











