»   » అనిరుధ్ ని తీసేసి త్రివిక్రమ్ అతన్నే ఫైనల్

అనిరుధ్ ని తీసేసి త్రివిక్రమ్ అతన్నే ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనిరుధ్ కు తెలుగులో అచ్చి వస్తున్నట్లు లేదు. ఏదో ఒక సమస్య వచ్చి ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారు. రామ్ చరణ్ ..బ్రూస్ లీ చిత్రం నుంచి అప్పట్లో అనిరుధ్ ని తొలిగించి తమన్నా ఆ ప్లేస్ లో కి వచ్చారు. ఇప్పుడు మరోసారి అనిరుధ్ కు అలాంటి అనుభవమే ఎదురైంది.

త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న అఆ చిత్రానికి ఆయన్ను సంగీత దర్శకుడుగా మొదట అనుకున్నారు. కానీ ఇఫ్పుడు ఆయన్ను తొలిగించి మిక్కీ జే మేయర్ కు అవకాసం ఇచ్చినట్లు సమాచారం.

Mickey J Meyer replaces Anirudh in A…Aa

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగం గాజరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది.

‘అ..ఆ' లో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Mickey J Meyer replaces Anirudh in A…Aa

 ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు పని చేస్తున్నారు. కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
After ‎BruceLeeTheFighter‬ Music Director Anirudh Replaced again in a Telugu Project this time Trivikram's A..Aa. Mickey J Mayer to take over
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu