మహేష్-వెంకీ కోసం కమిటైన మిక్కీ జే

By Bojja Kumar

మహేష్ బాబు-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో దిల్ రాజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారయ్యాడు. గతంలో హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. రణగొణ ద్వనులు లేకుండా వినసొంపైన బాణీలు కట్టడంలో మిక్కీ జే మేయర్ మంచి నిపుణుడు. ఈ సినిమా కూడా క్లాసిక్ టచ్ తో కూడుకున్నది కావడంతో మిక్కేజేను సంగీత దర్శకుడిగా ఎపిక చేసినట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత రొమాన్స్ చేయడానికి కమిట్ అవ్వగా, వెంకటేష్ సరసన త్రిష జతకట్టబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ది బిజినెస్ మ్యాన్ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ బాడీగార్డ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన అనంతరం అంటే...2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు-వెంకీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X