ఆగస్ట్ 15 రిలీజ్ సినిమాలన్నీ ఢమాల్.. పాన్ ఇండియా మూవీస్ స్థానాల్లో..
సినీ పరిశ్రమలో ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ టాక్ అండ్ కంటెంట్ ఉన్న సినిమాలు విఫలం అవుతాయి, కొన్ని పక్కా క్రింజ్ సినిమాలు హిట్ అవుతాయి. అలాగని ప్రతిసారి ఇదే జరగదు కానీ కొన్ని సెంటిమెంట్స్ కానీ కొన్ని యాదృచ్చికాలు మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కాగా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పరిస్థితులు అంతా పాన్ ఇండియా సినిమాలే డిసైడ్ చేస్తున్నాయి.
మొదటిగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా కానీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంటే ఆ డేట్ లో మరో సినిమాని అనౌన్స్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పాలి. దాదాపు ఆ డేట్ లో క్లాష్ లు లేకుండానే సినిమాలు మెయిన్ గా మిడ్ రేంజ్ సినిమాలు అయితే అసలు వచ్చేందుకు సాహసం చేయవు. మరి ఇలా ఇంపాక్ట్ చూపించే సినిమాలు ఒకసారి కానీ ఆ డేట్ నుంచి తప్పుకుంటే డెఫినెట్ గా ఒక్కసారిగా ఎన్నో మిడ్ రేంజ్ సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.

మరి సరిగ్గా మన టాలీవుడ్ లో ఇదే జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచే చూసుకుంటే గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల సెన్సేషనల్ "సలార్" ని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఆ డేట్ లో మరో ఏ సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ఒక్క తెలుగు నుంచే కాకుండా తమిళ్ నుంచి కూడా ఏ సినిమా వచ్చే సాహసం చేయలేదు.
కానీ ఒక్కసారి ఈ డేట్ నుంచి సలార్ తప్పుకున్నాక మొత్తం మూడు సినిమాలు వచ్చేసాయి. తెలుగు నుంచి "స్కంద", "పెద కాపు" సినిమాలు వస్తే తమిళ్ నుంచి "చంద్రముఖి 2" వచ్చింది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే మూడు సినిమాలు కూడా భారీ ప్లాప్ అయ్యాయి. వసూళ్ల పరంగా స్కంద ఓకే అనిపించింది కానీ దానికి జరిగిన బిజినెస్ రేంజ్ వసూళ్లు అందుకోలేదు. దీనితో ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఈ ఏడాదిలో అయితే ఏప్రిల్ 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం "దేవర" రావాల్సి ఉంది కానీ అప్పుడు దేవర రాకపోవడంతో ఆ ప్లేస్ ని మిడ్ రేంజ్ సినిమా విజయ్ దేవరకొండ నటించిన "ది ఫ్యామిలీ స్టార్" సొంతం చేసుకున్నాడు కానీ ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.

ఇక ఫ్రెష్ గా ఈ ఆగష్టు 15కి వస్తే ఈ డేట్ లో నిజానికి హైలీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సీక్వెల్ "పుష్ప 2" రావాల్సి ఉంది. కానీ ఈ డేట్ నుంచి పుష్ప కూడా తప్పుకోవడంతో ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలు వచ్చేసాయి. కానీ తెలుగు నుంచి అయితే మిడ్ రేంజ్ లో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్నాయి. మళ్ళీ రామ్ పోతినేని నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్, అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్ లు ఈ డేట్ లోకి రాగా ఈ రెండూ దారుణమైన రివ్యూస్ తెచ్చుకున్నాయి.
దీనితో ఆ పాన్ ఇండియా సినిమాలు వదిలేసిన డేట్స్ లో వచ్చిన ఈ మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం ఘోరంగా విఫలం అయ్యాయని చెప్పాలి. మరి ఆ డేట్స్ లో ఆ పాన్ ఇండియా సినిమాలే వచ్చేసి ఉంటే బాగుండేది ఏమో కానీ ఏదో జరుగుతుంది అనుకుంటే ఈ సినిమాలకి చివరికి బూడిదే మిగిలేలా ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











