డబ్బింగ్ చెప్పకపోతే అదొక వెలితి.. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మొత్తానికి ఓటీటీ ప్రపంచంలో ఒక మంచి హిట్ మూవీగా నిలిచింది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కష్టకాలంలో అమెజాన్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ కి చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో వారి ఆనందాన్ని చిత్ర విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఫిల్మీబీట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ కొన్ని విషయాల గురించి మాట్లాడింది.

Recommended Video

Middle Class Melodies: డబ్బింగ్ చెప్పుకోలేకపోతే యాక్టర్ గా అదొక వెలితి... Varsha Bollamma

వర్ష మాట్లాడుతూ.. స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు వినోద్ ఆనంతోజు చాలా క్లియర్ గా ఉన్నాడు. నేను పెద్దగా మార్పులు చేయాలని కోరలేదు. కొన్ని సన్నివేశాల్లో చిన్నపాటి చెంజెస్ చెప్పినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో మాత్రం మార్పులు కావాలని అడగలేదు. ఈ సినిమా పాత్రలో మెయిన్ గా నాకు నచ్చింది ఏమిటంటే.. డైలాగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఒక యాక్టర్ గా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది. ఇక ఈ సినిమాలో డబ్బింగ్ నేనే సొంతంగా చెప్పుకున్నాను. డబ్బింగ్ చెప్పకుంటే యాక్టర్ గా అదొక వెలితి ఉంటుంది.

Middle class melodies actress vasrha bollamma interesting comments

గుంటూరు స్లాంగ్ కొంచెం కష్టంగా ఉంటుందని అనుకున్నాను. కానీ చెప్పేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాను. సెట్స్ లో అందరూ గుంటూరు స్లాంగ్ లోనే మాట్లాడేవారు. డబ్బింగ్ టైమ్ లో అది చాలా హెల్ప్ అవుతుంది. ముందుగానే దర్శకుడు గుంటూరు స్లాంగ్ కి సంబంధించిన కొన్ని ఆడియో నోట్స్ ని పంపించాడు. అప్పటి నుంచే హోమ్ వర్క్ చేశాను. ఇక సినిమాకు సంగీతం అందించిన స్వీకర్ ఆగస్తీ చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారని వర్ష తెలిపారు.

ఇక అమెజాన్ లో సినిమా రీలీజ్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఆర్టీస్ట్ కి బిగ్ స్క్రీన్ పై చూసుకోవాలని ఉంటుంది. కానీ ఈ పాండమిక్ సమయంలో అందరూ హ్యాపీగా సినిమా చూడాలని అనుకుంటాము. అందుకే డిజిటల్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుంది. మంచి కామెడీ తో పాటు ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుందని వర్ష బొల్లమ్మ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X