twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్‌కు తనికెళ్ల భరణి ‘మిథునం’ సిఫార్సు

    By Bojja Kumar
    |

    Midhunam
    హైదరాబాద్: తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా రూపొందిన 'మిథునం' చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్లకు పంపాల్సిందిగా... ముంబైలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిఫార్సు చేసారు.

    ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన 25 పేజీల "మిథనం" కధకు వెండితెరపై రూపాన్ని ఇచ్చి ఈనాటి సమాజంలో ఉన్న మన అందరిచేత ఆలోచింపచేసే ప్రయత్నం చేశారు తనికెళ్ళ భరణి. ఈ సినిమా చూస్తున్నంత సేపు రెండున్నర గంటలు ప్రేక్షకుడు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో తెలియని భారం, భాద. కాని ఈ రెండిటి మధ్య ఏదో ఒక తియ్యని అనుభూతి. అదే "మిథునం".

    ఇక కధలోకి వెళ్ళితే చిన్న పిల్లవాడి మనస్తత్వం, భోజన ప్రియత్వం కలిగిన ఓ పెద్దాయన (యస్.పి.బాలసుబ్రహ్మణ్యం). ఆయన కోరింది వండి పెడుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కునే పెద్దావిడ (లక్ష్మీ). వీరిద్దరి కధే ఈ సినిమా. వీరికి పిల్లలు ఉన్నారు కాని పరాయి దేశంలో ఉంటారు. దానితో తమను పెంచిన నేలని, ఇంత వారిని చేసిన గాలిని, అగ్నిహోత్ర మంత పవిత్రమైన జీవితాన్ని, తమ దాంపత్య మధుర జ్ఞాపకాలని అనుక్షణం గుర్తుచేసే వారి ఇంటిని మరచిపోలేక, వదిలి వెళ్ళలేక నిస్సహాయులైన ఆ భార్య భర్తల జేవితమే ఈ సినిమా కధ.

    English summary
    Film Federation of India, Mumbai; Telugu Film Producers Council, Hyderabad has been recommended Tanikella Bharani's directorial Midhunam (2012) for the Oscar entry in the category of 'Best Foreign Language Film Award'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X