జూ. ఎన్టీఆర్‌కు మైటీస్టార్ టైటిల్?
ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఆయన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు ఏదైనా మంచి బిరుదు తగిలిస్తే ఆయన జాతకం మారుతుందని ఆయన అభిమాన సంఘాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఇచ్చిన తర్వాత ఆయన మరింత వెలుగులోకి వచ్చారని, అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్‌కు మైటీస్టార్ అనే విశేషం తగిలించాలని అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్టీఆర్ అశోక్ సినిమా త్వరలో విడుదల కానుంది. అశోక్ ఆడియో నిస్సందేహంగా హిట్ అయింది. దానికి టాప్ రేటింగ్ వచ్చింది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. అశోక్ సింగపూర్, మలేషియా ప్రదర్శన హక్కులను శ్రీ రాజ్యలక్ష్మీ మూవీస్ సంస్ధ పొందింది.


Click it and Unblock the Notifications