రానా అఫైర్స్ పై మిహీకా రియాక్షన్.. ఆ విషయాలన్నీ తెలుసట!
రానా దగ్గుబాటి కూడా ప్రభాస్ లాగానే మరికొన్నాళ్లు సింగిల్ గానే ఉంటాడని చాలా మంది అనుకున్నారు. కానీ బాహుబలి విలన్ మాత్రం వయసు మరింత ఎక్కువ కాకముందే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు ఒకేసారి వివరణ ఇవ్వడంతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మొత్తానికి మిహికా బజాజ్ ని సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్న రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని సందేహాలకు సమాధానం ఇచ్చాడు.

రానా అఫైర్స్ పై మిహికా రియాక్షన్
సాధారణంగా హీరోల బ్యాచిలర్ లైఫ్ లో ఏ హీరోయిన్ తో కనిపించినా కూడా గాసిప్స్ రావడం సహజమే. ఇక రానా లైఫ్ లో కూడా ఆలాంటివి ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా త్రిషతో డేటింగ్ చేసినట్లు అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ గురించి రానా ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. ఇక రానా భార్య మిహికా గాసిప్స్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందనే సందేహంపై రానా క్లారిటీ ఇచ్చాడు.

మిహీకాకు వాటి గురించి బాగా తెలుసు..
రానా మాట్లాడుతూ.. "నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మిహీకాకు కూడా వాటి గురించి బాగా తెలుసు. ఆమె ముంబై, హైదరాబాద్ లలో పెరిగారు. ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే అవకాశమే లేదు. ఆమెకు ప్రతిదీ తెలుసు. అయితే అలాంటి గాసిప్స్ గురించి ప్రస్తుత తరం యువత ఎక్కువగా ఆలోచిస్తారని నేను అనుకోనని రానా చెప్పాడు.

మిహీకా బాధపడలేదు
చాలా వరకు అలాంటి రూమర్స్ గురించి ఎవరు ఆలోచించరు అంటూనే ఈ సంబంధాల గురించి కొంతమందికి నిజమని అనిపించినప్పటికీ.. మిహీకా అలాంటి గాసిప్‌ల గురించి ఎప్పుడూ బాధపడలేదని రానా అన్నాడు. మొత్తానికి ఇద్దరి మధ్యన ఒక పదునైన నమ్మకం ఉందని రానా వివరణ ఇచ్చాడు. ఇక తన అనారోగ్యం గురించి మిహీకాకు పెద్దగా తెలియదని రానా తెలిపాడు.

అర్థం చేసుకునే భార్య దొరికింది
దాని గురించి తెలుసుకునే సమయానికి, రానా అప్పటికే బాగానే ఉన్నాడు. కాబట్టి మిహీకా తన ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందలేదని రానా వివరణ ఇచ్చారు. ఏదేమైనా రానా దగ్గుబాటి అర్థం చేసుకునే మంచి భార్యను పొందాడు ఆంటూ నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో అరణ్య సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే త్వరలో మిలింద్ రావ్ దర్శకత్వంలో ధీరుడు అనే ఒక హారర్ సినిమాను సెట్స్ పైకితేనున్నాడు.


Click it and Unblock the Notifications











