twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెత్త రాతలు వద్దు.. ఆ వెబ్‌సైట్‌పై రానా ప్రేయసి మిహికా బజాజ్ మండిపాటు

    |

    టాలీవుడ్ భల్లాలదేవుడు రానా తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు ముగింపు పలుకుతూ.. పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించడం దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. తన ప్రేయసి మిహికా బజాజ్‌ తన పెళ్లి ప్రపోజల్‌‌కు ఎస్ చెప్పిందని రానా చేసిన ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అయింది. అయితే రానాతో అఫైర్ గురించి ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన వెబ్‌సైట్ ప్రచురించిన వార్తపై మిహికా బజాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ఆ వెబ్‌సైట్ ఎలాంటి కథానాన్ని ప్రచురించిందంటే..

    కపూర్ కుటుంబంతో క్లోజ్ రిలేషన్స్

    కపూర్ కుటుంబంతో క్లోజ్ రిలేషన్స్

    బాలీవుడ్‌ ప్రముఖులతో మిహికా బజాజ్‌కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లో అనిల్ కపూర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనమ్ కపూర్ పెళ్లికి ఆహ్వానించిన కొందరిలో మిహికా ఉన్నారు. సోనమ్‌తో మిహికా క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ కారణంగా రానాతో పెళ్లి వార్త బయటకు రాగానే ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పింది అని జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్ తన కథనంలో వెల్లడించింది.

    రానా కోట్లాది మంది హృదయాలను

    రానా కోట్లాది మంది హృదయాలను

    మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నానంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్వీట్ చేయడం కోట్లాది మంది అభిమానుల హృదయాలను గాయపరిచింది. అయినప్పటికీ మిహికాతో వివాహం వార్త అభిమానులను, సన్నిహితులను సంతోషానికి గురిచేసింది అని తన కథనంలో పేర్కొన్నది.

    రెండేళ్లుగా సీక్రెట్ డేటింగ్

    రెండేళ్లుగా సీక్రెట్ డేటింగ్

    అలాగే రానాతో మిహికా బజాజ్ బంధం ఇప్పటిది కాదు. దశాబ్దకాలంగా ఆమెకు రానాకు పరిచయం ఉంది. రానా పాల్గొన్న పలు ఈవెంట్లను మిహికా కవర్ చేసింది. గత రెండేళ్లుగా వారిద్దరు సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరు తమ లవ్ లైఫ్‌ను బయట పడకుండా మేనేజ్ చేశారు. రానా, మిహికా బజాజ్ రిలేషన్ గురించి బయటకు తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అని ఆ వెబ్‌సైట్ పేర్కొన్నది.

    Recommended Video

    Sri Reddy Post On Rana And Miheeka Bajaj Relation, Different Angle Of Sri Reddy
    చెత్త రాతలు ఎందుకు అంటూ

    చెత్త రాతలు ఎందుకు అంటూ

    జాతీయ మీడియాకు చెందిన వార్తపై తాజాగా మిహికా బజాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తకు సమాధానం ఇస్తూ.. ఇలాంటి వార్తలు రాయడం ఎందుకు. చెత్త వార్తలు రాయాల్సిన అవసరం ఉందా? మంచిగా రాయడం రాదా అన్నట్టు మిహికా బజాజ్ సెటైర్ వేసింది. మహికా బజాజ్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

    English summary
    Miheeka Bajaj serious over Dating news with Rana Daggubati by media. One of the national media telecasted about Rana, Miheeka dating news recently. For response to that news, Miheeka said.. Write news well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X