అంతా నువ్వే.. రానాకు భార్య స్వీటెస్ట్ మెసేజ్.. సమంత, వెంకటేష్ కూతురు క్రేజీగా..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి వివాహం తన ప్రియురాలు మిహిక బజాజ్‌తో జరిగిన సరిగ్గా వారం రోజులు అవుతున్నది. వారి పెళ్లి వేడుక రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8వ తేదీ రాత్రి 8.30 నిమిషాలకు అతికొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. రానాతో పెళ్లి తర్వాత మిహిక అద్భుతమైన వైవాహిక జీవిత క్షణాలను ఆస్వాదిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ క్రమంలో మిహిక తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. మిహికా చేసిన పోస్టు ఏమిటంటే..

రానా,మిహికా పెళ్లి ఫోటోలు వైరల్
రానా, మిహిక పెళ్లికి హాజరైన స్నేహితులు, సినీ తారల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. సమంత, చైతన్య దంపతులు, రాంచరణ్, ఉపాసన దంపతుల హడావిడి, అల్లు అర్జున్ స్టైలిష్ ఫోటోలు నెటిజన్లు విశేషంగా ఆకర్షించాయి. అంతేకాకుండా మిహిక, రానా కుటుంబాల కలిసి దిగిన పెళ్లి గ్రూప్ ఫోటోలు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేశాయి.

పెళ్లి తర్వాత వేడుకల్లో నవ దంపతులు
పెళ్లి తర్వాత దగ్గుబాటి కుటుంబం నిర్వహించిన సత్యనారాయణ వ్రతంలో రానా, మిహిక కలిసి చేసిన పూజ ఫోటోలకు కూడా జాతీయ వ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షించాయి. పెళ్లి తర్వాత అన్ని రకాల పూజలు పూర్తి చేసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. రానా, మిహికా పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

రానాకు మిహిక ఐ లవ్ యూ అంటూ
వారం రోజుల వైవాహిక జీవితం అనంతరం రానాకు మిహిక అద్భుతమైన మెసేజ్‌ను పోస్ట్ చేశారు. నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ అంతా నువ్వే. నా జీవితంలో పూర్తి భాగమై నా లైఫ్‌కు అర్థం చేకూర్చినందుకు థ్యాంక్స్. నా వ్యక్తిగత జీవితంలో కూడా సంపూర్ణమైన వ్యక్తిగా, మంచి మనిషిగా చేసింది నువ్వే.. ఐ లవ్ యూ అంటూ మిహిక ఇన్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది.
Recommended Video

సమంత, వెంకటేష్ కూతురు క్రేజీగా
మిహికా బజాజ్ దగ్గుబాటి పెట్టిన పోస్టుపై అభిమానులే కాకుండా.. సమంత అక్కినేని, దగ్గుబాటి వెంకటేష్ కూతురు ఆశ్రిత, తల్లి బంటీ బజాజ్ కామెంట్లే చేశారు. నీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి అంటూ సమంత కామెంట్ చేసింది. మీ ఫోటో చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందని ఆశ్రిత కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











