Mike Tyson: లైగర్​లో నటించిన విషయం మర్చిపోయిన మైక్​ టైసన్​!.. వీడియో వైరల్​..

టాలీవుడ్ డేరింగ్​ అండ్​ డ్యాషింగ్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్​ విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో తొలిసారిగా వచ్చిన చిత్రం లైగర్​. ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో లెజండరీ బాక్సర్​ మైక్ టైసన్​ నటిస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటినుంచి లైగర్​పై విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది.

అయితే మొత్తానికి లైగర్​లో మైక్​ టైసన్​ నటించడం, అతని క్యారెక్టరజేషన్​ బాగా లేదని ఆడియెన్స్​ ఓపెన్​గానే ఫీలయ్యారు. అందులో ఆయన నటించిన విషయం మరిచిపోతే బాగుండు అనుకున్నారు. ఆడియెన్స్ ఏమో గానీ లైగర్​లో నటించిన విషయాన్ని మైక్​ టైసన్​ నిజంగానే మర్చిపోయారనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే.

భారీగా అంచనాలు..

భారీగా అంచనాలు..

టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​ పూరి, క్రేజీ హీరోగా విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో ఓ మూవీ వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ మూవీకి లైగర్​ అని టైటిల్​ డిక్లేర్​ చేయడం, అందులో లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. వాటికి తోడు సినిమా పోస్టర్లు, టీజర్​, సాంగ్స్, ట్రైలర్​ మరింత ఊపునిచ్చింది. ఇక మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో లైగర్​ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.

మరి కామెడీగా..

మరి కామెడీగా..

ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 25న వరల్డ్​వైడ్​గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే అంచనాలకు భిన్నంగా లైగర్​ ఫ్లాప్​ టాక్​ను మూటగట్టుకుంటోంది. అంతేకాకుండా ఇందులో మైక్​ టైసన్​ పాత్రను మరి కామెడీగా చూపించారని ఆయన అభిమానులు, ప్రేక్షకులు చాలానే ఫీలయ్యారు. ఈమాత్రం దానికి అతన్నే పెట్టాలా? ఎవరైనా కమెడియన్​ను పెడితే సరిపోయేదిగా? అంటూ పూరిని తిట్టుకున్నారు.

నటించినట్లు మరిచిపోయిన టైసన్​..

నటించినట్లు మరిచిపోయిన టైసన్​..

దీంతో లైగర్​లో మైక్ టైసన్​ నటించాడనే విషయం మరిచిపోతే బాగుండు అని అనుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఈ విషయాన్ని మైక్ టైసనే మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ పాడ్​కాస్ట్ వీడియోలో స్నేహితులతో కలిసి ముచ్చటించాడు మైక్ టైసన్. ఈ వీడియోలో ''లైగర్​లో మీ పాత్ర ఏంటీ?'' అని టైసన్​ను అతని ఫ్రెండ్స్ ప్రశ్నిస్తారు. దీంతో కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు మైక్​ టైసన్.

రెండు సెకన్లలో..

'ఏదీ మళ్లీ ఒకసారి చెప్పు' అని మైక్ అనడంతో గూగుల్​లో సెర్చ్ చేసి.. ''బాక్సింగ్​ లెజెండ్​ మైక్​ టైసన్ ఇండియన్​ స్పోర్ట్స్​ యాక్షన్​ మూవీ లైగర్​లో నటిస్తున్నారు'' అని చదివి వినిపిస్తారు టైసన్​ ఫ్రెండ్స్​. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న చర్చ కాస్తా.. లైగర్ యానిమల్​ వైపు వెళ్తుంది. 'మీరు లైగర్​తో పోటీ పడ్డారా?' అని అడిగిన ప్రశ్నకు ''లేదు. దానికి ఎదురు పడితే రెండు సెకన్లలో చంపేస్తుంది'' అని సమాధానం ఇచ్చారు మైక్​ టైసన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఎలా ఒప్పించారు?

ఎలా ఒప్పించారు?

సో.. ఇదంతా చూస్తుంటే.. లైగర్​లో నటించినట్లు మైక్​ టైసన్​కు అసలు గుర్తు లేనట్లే ఉంది. అలాంటి ఓ చిత్రంలో మైక్​ టైసన్ నటించిన విషయమే ఆయనకు గుర్తు రాలేదు. దీంతో ఇప్పుడు అసలు లైగర్​ సినిమా కోసం మైక్​ టైసన్​కు ఏం చెప్పి ఒప్పించారు అనే ప్రశ్న మొదలవుతోంది. సినిమా ప్రమోషన్స్​లో అయితే మైక్​ టైసన్​ను ఒప్పించడం కోసం ఛార్మి ఎంతో కష్టపడిందని పూరి జగన్నాథ్ చాలా సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X