Mike Tyson : తోటి ప్రయాణికుడిని చితక్కొట్టిన బాక్సింగ్ లెజెండ్.. అసలు ఏమైందంటే?
బాక్సింగ్ లెజెండ్, మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన అనుకోని రీతిలో వార్తల్లోకి ఎక్కాడు. ఆయన తన తోటి ప్రయాణికుడు మీద ఎటాక్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
పిడిగుద్దుల వర్షం
మైక్ టైసన్ విమాన ప్రయాణంలో తన సహనం కోల్పోయాడు. విమానంలో తోటి ప్రయాణికుడు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ప్రయాణికుడి వెర్రి చేష్టలు చాలా సేపు సహించిన టైసన్ సహనం కోల్పోయిన క్రమంలో ఆవేశంతో అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరనున్న విమానంలో జరిగింది.

ఈ నెల 20న
మైక్ టైసన్ ఈ నెల 20న అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు విమానం ఎక్కాడు. అయితే అదే విమానంలో టైసన్ సీటు వెనకాల కూర్చున్న ఓ ప్యాసింజర్ టైసన్ ను చూడగానే మాటలు కలిపాడు. టైసన్ కూడా తొలుత నవ్వుతూనే బదులిచ్చాడు. సదరు ప్యాసింజర్ అంతటితో ఆగకుండా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టడంతో టైసన్ అతన్ని వారించేందుకు ప్రయత్నించాడు.

తీవ్రంగా కొట్టి
కొంచెం అలసటగా ఉంది, న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని కోరారు. అయినా ఆ ప్యాసింజర్ టైసన్ మాట వినలేదు. దీంతో ఇక సహనం కోల్పోయిన క్రమంలో టైసన్ ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అదే ఫైట్ లో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనకు సంబందించి వీడియో రికార్డు చేశారు. ఈ వీడియోలో టైసన్ తన సీటు వెనుకకు వంచి వెనుక సీటులో ఉన్న తోటి ప్రయాణికుడిని తీవ్రంగా కొట్టినట్టు వీడియో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

'ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్'
ఈ దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఒక ప్రముఖ అమెరికన్ వెబ్ సైట్ TMZ ఎంటర్టైన్మెంట్ ప్రకారం.. మైక్ టైసన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు టైసన్‌పై కామెంట్ చేశాడు. 'ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్' అంటూ అతనిని ఆట పట్టించడానికి ప్రయత్నించాడు. మొదట్లో అతడి కామెంట్లను టైసన్ పెద్దగా పట్టించుకోలేదు.

ఇండియన్ సినిమా ఎంట్రీ
ఆ తర్వాత ప్లీస్ ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు. చివరికి సహనం కోల్పోయిన టైసన్ తన పంచ్ పవర్ చూపించడంతో అతను నోరు మూసుకున్నాడు. అయితే ఈ ఘటన జరుగుతున్న క్రమంలో అక్కడి ఇతర పాసెంజర్లు తమ తమ ఫోన్లలో వీడియో రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాడి తర్వాత ఆ బాధితుడి గాయాల ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతనికి గట్టిగానే దెబ్బలు తగిలినట్టు చెబుతున్నారు. ఇక పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ దాడి ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.


Click it and Unblock the Notifications











