పెళ్లి డేట్ ఫిక్స్: 20ఏళ్ల బ్యూటీతో 50 ఏళ్ల నటుడి ప్రేమ వ్యవహారం ఇంట్రెస్టింగ్!

By Bojja Kumar

బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అతడు మరో వివాహం చేసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ.... అతగాడు పెళ్లాడబోయే అమ్మాయి వయసు చూసే అంతా షాకవుతున్నారు. మిలింద్ కొంతకాలంగా అంకింత కోన్వర్ అనే అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వయసు కేవలం 23 సంవత్సరాలే. తన వయసులో సగం ఉన్న ఆ పాపను ఈ ముదురు బెండకాయ ఎలా పడేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Recommended Video

వీడు మామూలోడు కాదు.. 23 ఏళ్ల అమ్మాయితో 52 ఏళ్ల నటుడి వివాహం?
 పెళ్లికి సిద్ధమైన జంట

పెళ్లికి సిద్ధమైన జంట

జాతీయ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మిలింద్ సోమన్-అంకిత కోన్వర్ ఈ నెలలోనే పెళ్లికి సిద్దమయ్యారని, ఏప్రిల్ 21న వీరిద్దరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.

 వివాహం ఎక్కడ జరుగబోతోంది?

వివాహం ఎక్కడ జరుగబోతోంది?

పెద్దగా హంగులు, ఆర్బాటాలు లేకుండా సింపుల్‌గా వివాహం చేసుకోవాలని మిలింద్, అంకిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ వీరి వివాహానికి వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు హాజరు కాబోతున్నారట.

 ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిందా?

ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిందా?

ఇటీవల అంకిత కోన్వర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఫోటోతో వీరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే వీరు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించలేదు.

 అందుకే ఆమె అంటే అతడికి ఎంతో ఇష్టం

అందుకే ఆమె అంటే అతడికి ఎంతో ఇష్టం

తన గర్ల్ ఫ్రెండ్ గురించి మిలింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... నేను ఈ రోజు ఒక ప్లేసులో ఉంటాను, రేపు మరో ప్లేసులో ఉంటాను. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నా జీవితాన్ని ఆమె బాగా అర్థం చేసుకుంది, నన్ను ఇష్టపడుతోంది అని తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ జంటపై విమర్శలు

సోషల్ మీడియాలో ఈ జంటపై విమర్శలు

సోషల్ మీడియాలో తమ జోడీపై ట్రోలింగ్ జరుగడంపై మిలింద్ స్పందిస్తూ....అవేమీ తాను పట్టించుకోను, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, నా లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ సహానా గోస్వామీ నాకంటే 21 సంవత్సరాలు వయసులో చిన్నదని, మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో సమయంలో నా భార్య నాకంటే 18 సంవత్సరాలు చిన్నదని మిలింద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 మిలింద్-అంకిత పరిచయం ఎలా జరిగిందంటే....

మిలింద్-అంకిత పరిచయం ఎలా జరిగిందంటే....

‘నేను ఆమెను చెన్నైలో ఓ నైట్ క్లబ్‌లో కలిశాను. నేను అసలు నైట్ క్లబ్‌లకు వెళ్లాను... ఆ రోజు అనుకోకండా వెళ్లాను. అక్కడ ఒకరితో కలిసి డాన్స్ చేస్తున్న సమయంలో ఆమెను చూశాను, చూసిన వెంటనే నచ్చేసింది. మీకు ఇష్టం అయితే కాల్ చేయండి అని నా నెంబర్ ఇచ్చాను. తర్వాతి రోజు నాకు కాల్ చేసింది. అలా ఫిబ్రవరి 2014లో మా పరిచయం జరిగింది. ఆ సమయంలో ఆమె ఎయిర్ ఏషియాలో పని చేస్తోంది. ముంబైకి వెళ్లాలనే ఉద్దేశ్యంలో ఉంది. అపుడు ముంబైలో ఎయిర్ ఏషియా బేస్ లేక పోవడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది అని మిలింద్ సోమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మిలింద్ వారికి కూడా నచ్చేశాడు

మిలింద్ వారికి కూడా నచ్చేశాడు

మిలింద్ ఇటీవల అకింతతో కలిసి ఆమె స్వస్థలం గౌహతి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంకిత కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కలిశారు. మిలింద్, అంకిత ప్రేమ వ్యవహారం... వీరి మధ్య ఉండే ఏజ్ గ్యాప్ గురించి కుటుంబ సభ్యులకు మొదటి నుండి కొన్ని అభ్యంతరాలు ఉండేవట. అయితే ఇటీవల అతడు స్వయంగా వచ్చి కలిసిన తర్వాత అతడి వ్యక్తిత్వం, మంచితనం చూసి వాళ్లు కూడా అతడినే తమ ఇంటి అల్లుడిని చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారట.

 వయసు పైబడినా... విషయం ఉన్నోడే!

వయసు పైబడినా... విషయం ఉన్నోడే!

మిలింద్ సోమన్ వయసు ఎక్కువే అయినా... విషయం ఉన్నోడే. అటు ఫిట్ నెస్ పరంగా ఆయన ది బెస్ట్ అని నిరూపించుకున్నాడు. బాలీవుడ్ పాపులర్ స్టార్లలో ఒకరైన మిలింద్ సంపాదన పరంగా కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు.

 ఇప్పటికే ఓ వివాహం చేసుకున్న మిలింద్

ఇప్పటికే ఓ వివాహం చేసుకున్న మిలింద్

మిలింద్ సోమన్ 2006లో మైలీనే జంపానోయ్ అనే ఫ్రాన్స్ నటిని పెళ్లాడారు. అయితే 2009లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అతడు పెళ్లి చేసుకోలేదు. తాను మంచి భర్తగా ఉండలేను. నా జీవితానికి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. అయితే నేను ఒక గ్రేట్ బాయ్ ఫ్రెండుగా మాత్రం ఉండగలను అని మిలింద్ సోమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి అలాంటి వ్యక్తి మళ్లీ ఇపుడు రెండో పెళ్లికి సిద్దమవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X