నేల‘పాలు’ చేసిన పవన్ అభిమానులు!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. అభిమానుల నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదల సందర్భంగా ప్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా పోస్టర్లకు పాలాభిషేకాలు, సినిమా హాళ్ల వద్ద టపాసుల మోత....అబ్బో! అదరగొట్టారు.

అంతా బానే ఉందికానీ....పోస్టర్లకు పాలాభిషేకం పేరుతో లీటర్ల కొద్దీ పాలను నేల పాలు చేయడం చర్చనీయాంశం అయింది. ‘గోపాల గోపాల' సినిమాలో ఓ సన్ని వేశంలో పాలాభిషేకం పేరుతో పాలను నేలపాలు చేయడం ఎందుకు? అలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? మట్టిలో కలిసి పోవడం తప్ప? వాటిని ఎవరైనా పేద వారికి, లేదా భక్తులకు పోస్తే తాగుతారు కదా? అనే సన్ని వేశం ఉంటుంది. మరి సినిమాలో ఆ సీన్ చూసైనా అభిమానులు రియలైజ్ అవుతారో లేదో చూడాలి.

Milk Wasted: Pouring on Pawan Kalyan's Gopala Gopala poster

అఫ్ కోర్స్....పవన్ అభిమానులు పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాల ద్వారా పాలు, పండ్లు పంపిణీ సారు. అయితే ఇలా పోస్టర్లపై పాలు పోయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అవే పాలను సినిమా విడుదల సందర్భంగా ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది కదా అనేదే ఇక్కడ పాయింట్. పవన్ కళ్యాణ్ మనస్తత్వం కూడా ఇలాంటి వృధాను కోరుకునే మనస్తత్వం కాదుకదా!

గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X