twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Milkha Singh కన్నుమూత.. Bhaag Milkha Bhaag ఇకలేరు.. అక్షయ్ కుమార్ షాకింగ్ ట్వీట్!

    |

    బాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బయోపిక్ భాగ్ మిల్కా భాగ్ మూవీకి స్పూర్తిగా నిలిచిన ప్రపంచం గర్వించదగిన అథ్లెట్ మిల్కా సింగ్ ఇకలేరు. కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆయన శనివారం తెల్లవారుజామున (జూన్ 19న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. మిల్కా మరణంతో సినీ, రాజకీయ, ఇతర పరిశ్రమల ప్రముఖులు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకొని శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

    దేశ విభజన సమయంలో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెల్లు హత్య చేయబడటంతో మిల్కాసింగ్ అనాథగా మారుతారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చి ఇండియన్ ఆర్మీలో చేరుతారు. ఆ తర్వాత అతడి జీవితం అనేక మలుపులు తిరిగి అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకొంటాయి. అథ్లెట్‌గా మారి మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించారు.

     Milkha Singh no more: Shah Rukh Khan, Akshay Kumar, Priyanka Chopra, Raveena Tandon mourns

    1958లో టోక్యోలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 200 మీటర్లు, 400 మీటర్ల ట్రాక్ రేస్‌లో మిల్కా సింగ్ సరికొత్త రికార్డులు నెలకొల్పి బంగారు పతకాలు సాధించారు. 1958లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో 400 మిటర్ల రేసును 46.6 సెకన్లలో ముగించడం అప్పట్లో రికార్డుగా మారింది.

    1960లో పాకిస్థాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆ దేశానికి చెందిన అబ్దుల్ ఖాలీద్‌ను ఓడించడంతో మిల్కాసింగ్‌కు అప్పటి పాక్ జనరల్ అయ్యుబ్ ఖాన్ ది ఫ్లయింగ్ సిక్‌ అనే బిరుదు ఇచ్చారు. ఆ ఈవెంట్‌లో 400 మీటర్ల రేసును 45.8 సెకన్లలో ముగించడం విశేషం.

    ఇలాంటి విశేషాలు ఉన్న మిల్కా సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో ఫరాన్ అఖ్తర్ ఫ్లయింగ్ సిక్కుగా నటించారు. ఈ చిత్రానికి రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ విమర్శకుల మంచి కూడా రెస్పాన్స్ లభించింది.

    ప్రపంచ క్రీడాభిమానులను విషాదంలో ముంచి మరో లోకానికి వెళ్లిన మిల్కా సింగ్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, అంగద్ బేడీ, రవీనా టాండన్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. షారుక్ ఖాన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భౌతికంగా మిల్కా మన మధ్య లేకపోయినా.. ఆయన చరిత్ర మన గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. ఆయన లెగసీకి ఎవరు సాి రారు. నాకే కాదు.. లక్షలాది మందికి ఆయన జీవితం స్పూర్తి. మిల్కా ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్వీట్ చేశారు.

    మిల్కా సింగ్ జీవితం ఆధారంగా రూపొందే చిత్రంలో నటించే అవకాశం మిస్ చేసుకొన్నందుకు అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మిల్కా సింగ్ ఇకలేరే వార్త మహా విషాదం. వెండితెర మీద ఆయన పాత్రను పోషించకపోవడాన్ని ఎప్పటికీ బాధించే విషయంగా నన్ను వెంటాడుతుంది. స్వర్గంలో కూడా మీ బంగారు పరుగు ఆగకూడదు అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

    English summary
    Milkha Singh died at 91 with Coronavirus complications. In this tragic moments, Bollywood personalities Shah Rukh Khan, Akshay Kumar, Priyanka Chopra, Raveena Tandon condelonced on social media. Akshay Kumar wrote on twitter that, Incredibly sad to hear about the demise of MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen! May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X